Balakrishna Remuneration: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఏ ఒక్క సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులకు కన్నుల పండుగనే చెప్పాలి. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు… ఇక బాలయ్య సైతం ఈ సినిమాతో తన ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని నమ్ముతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పిరియాడికల్ డ్రామా సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక వారియర్ గా కనిపించబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ తొందరలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా ముహుర్తాన్ని జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ని తొందరలోనే ఇవ్వడానికి రెడీ అవుతున్నా. బాలయ్య లాంటి నటుడు ఒకే అంటే ఎలాంటి సినిమా నైనా చేసేయొచ్చు అంటూ చాలామంది దర్శకులు అభిప్రాయపడుతుంటారు.
నిజానికి బాలయ్య బాబు ఒక కథకి కనెక్ట్ అయితే మాత్రం ఆ కథ మీద 100% ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగుతూ ఉంటాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా విషయంలో కూడా అదే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఎలాగైనా సరే ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలని భార్య బాబు భావిస్తున్నాడట…
ఇక తను కూడా పిరియాడికల్ డ్రామా సినిమాను చేసి చాలా రోజులు అవుతోంది. కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్ లతో వస్తే తను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తానని బాలయ్య బాబు చెప్పకనే చెబుతున్నాడు…ఇక ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వరుసగా 4 విజయాలతో బాలయ్య క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
Also Read: పూరి జగన్నాథ్ సినిమాలోని ఆ క్యారెక్టర్ ను తీసుకొనే రాజమౌళి ఆ సూపర్ హిట్ మూవీ చేశాడా..?
ఈజీగా బాలయ్య బాబు సినిమాలు 100 కోట్లకు పైన కలెక్షన్స్ కి కొల్లగొడుతున్నాయి. తద్వారా బాలయ్య సైతం తన రెమ్యూనరేషన్ ని పెంచినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు 30 నుంచి 35 లో కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న బాలయ్య ఇప్పుడు 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…