Rajamouli film story: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక అతను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. పాన్ వరల్డ్ లో సైతం తనదైన రీతిలో మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… అందుకోసమే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని చాలా గొప్పగా డిజైన్ చేశారట. ఇక ఇది ఎలా ఉంటే రాజమౌళి గతంలో చేసిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని ‘విక్రమ్ సింగ్ రాథోడ్’ క్యారెక్టర్ ను పూరి జగన్నాథ్ చేసిన ‘శివమణి’ సినిమాలో నాగార్జున క్యారెక్టర్జేషన్ ని ఇన్స్పైర్ రాసుకున్నాడట. నిజానికి అందులో నాగార్జున చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు.
ఇక తనకి మెంటల్ అని చెబుతూ ఉంటాడు.హీరో అలా మెంటల్ అని చెప్పడం రాజమౌళికి బాగా నచ్చిందట… ఇక ఆ మెంటల్ పోలీస్ ఎలా ఉంటాడు, కోపం వస్తే ఏం చేస్తాడు, అసలు వాడు ఎలా ఉంటాడు అనే దాని నుంచే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. మొత్తానికైతే పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ వల్లే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ పుట్టిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
అప్పట్లో రాజమౌళికి గట్టి పోటీ ఇచ్చిన పూరీ జగన్నాథ్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా వింటేజ్ పూరి రాసిన డైలాగ్స్ గాని ఆయన తీసిన సీన్స్ గానీ బ్లాక్ బస్టర్స్ అయ్యేవి… అందుకే తనని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పిలుస్తూ ఉండేవారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘బెగ్గర్’ అనే సినిమా చేస్తున్నాడు…ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. తొందర్లోనే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్ ను రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే పూరి జగన్నాథ్ కి సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ డైలమాలో పడిపోయే అవకాశం ఉంది…