True Friendship Story: స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా కన్న… పని పదేపదే వింటూ ఉంటాం. ప్రపంచంలో స్వచ్ఛమైన బంధం స్నేహం మాత్రమే అని చాలామంది మేధావులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే స్నేహితుడి కోసం మరో స్నేహితుడు ప్రాణాలు ఇచ్చిన సంఘటనలు ఎన్నో చూసాం. అలాగే ఒక స్నేహితుడు గెలవాలంటే మరో స్నేహితుడి సపోర్టు ఉండడాన్ని చూస్తున్నాం. అయితే ప్రస్తుత కాలంలో స్వార్థం, డబ్బు తదితర కారణాలతో స్నేహాల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుత కాలంలో నిజమైన స్నేహం కనిపించడం లేదని కొంతమంది అంటున్నారు. కానీ నిజమైన స్నేహం ఇంకా ఉన్నది అని ఓ వ్యక్తి నిరూపిస్తున్నాడు. అలాంటి స్నేహం ఒక వీడియోలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నామంటే అతనికి డబ్బు అయినా ఉండాలి.. లేదా అతనితో ఏదైనా అవసరం ఉండాలి.. అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తి నుంచి ఏ విధంగా ఆశించకుండా ఆ వ్యక్తితో కలిసి ఉండటమే నిజమైన స్నేహం. అంతేకాకుండా ఆ వ్యక్తి ఆపదలో ఉంటే అతనికి సేవ చేయడం నిజమైన ఫ్రెండ్షిప్. అలా ఒక వ్యక్తి తన స్నేహితుడికి చేతులు లేకపోయినా తల్లిదండ్రుల లాగా తనకు తినిపిస్తూ.. నిజమైన స్నేహితుడు అని నిరూపించుకుంటున్నాడు. టిఫిన్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వీరిలో ఒకరికి చేతులు లేవు. అయితే టిఫిన్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇలాంటి సమయంలో తన స్నేహితుడు ఒకరు చేతులు లేని వ్యక్తికి దగ్గరుండి మరి టిఫిన్ తినిపిస్తున్నాడు. దీనిని చూసిన చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఒక స్నేహితుడు కోసం ఇంతలా ప్రేమను చూపిస్తూ తినిపించడంపై అందరూ ఆసక్తిగా చూశారు. అంతేకాకుండా కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో కింద స్నేహమంటే ఇదేరా.. స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తారు.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచంలో ఒక వ్యక్తికి ఉన్న సమస్యలు, సంతోషాలను మనస్ఫూర్తిగా స్నేహితులతో మాత్రమే పంచుకుంటారు. తల్లిదండ్రులు, బంధువులకు చెప్పలేని చాలా విషయాలు స్నేహితులకు చెప్పుకుంటారు. అలాగే ఒక వ్యక్తి తనకు నిజమైన స్నేహితుడు అని అనుకుంటే ఆ వ్యక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వస్తాడు. అలా ఒక వ్యక్తికి చేతులు లేకున్నా కూడా అతనితో స్నేహం చేస్తూ అతని అవసరాలు తీరుస్తున్న వ్యక్తి చేసే స్నేహం స్వచ్ఛమైనది అని అంటున్నారు.
అయితే ఇలాంటి స్నేహం కొందరికి మాత్రమే లభిస్తుంది. ప్రతి వ్యక్తికి చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ వారిలో ఎవరో ఒకరు మాత్రమే ప్రాణ స్నేహితుడిగా ఉంటారు. అలాంటి స్నేహితుడు ఎవరు అనేది ముందుగా నిర్ణయించుకోలేం. అయితే ఇద్దరి మధ్య నిజమైన స్నేహం ఉంటే వారి బంధం ఎప్పటికీ విడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఒకరి కోసం ఒకరు ఏ పని అయినా చేయడానికి ముందుకు వస్తారు.