Sathyam Sundaram: ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడానికి పెద్ద బడ్జెట్, భారీ గ్రాఫ్స్, సూపర్ స్టార్స్ ఇవేమి అవసరం లేదు, కేవలం కంటెంట్ ఉంటే ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మన టాలీవుడ్ అలాంటివి చాలానే జరిగాయి. అదే విధంగా తమిళం లో ‘సత్యం సుందరం’ విషయం లో జరిగింది. ఎలాంటి హంగామా లేకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం, సైలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సుమారుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు లో ‘దేవర’ విడుదలైన పక్క రోజే ఈ సినిమా విడుదలైంది. దేవర మేనియా లో కొట్టుకొని పోతుంది, అనవసరంగా ఇప్పుడు రిలీజ్ చేసారని అందరూ అనుకున్నారు కానీ, ‘దేవర’ ప్రభావం ఈ చిత్రంపై ఇసుమంత కూడా పడలేదు. తెలుగులో కూడా ఈ చిత్రం పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిల్చింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.
నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే వంద రేట్లు ఎక్కువ వచ్చింది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పేది ఒక్కటే మాట, ఇలాంటి సినిమాలను మన తెలుగు మేకర్స్ ఎందుకు తియ్యలేకపోతున్నారు అని. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ చిత్రాన్ని 19 లక్షల మంది వీక్షించారట. ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో టాప్ 5 వ్యూస్ ని సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే కల్కి హిందీ వెర్షన్ 45 లక్షల వ్యూస్ మొదటి వారంలో వచ్చాయి.
ఇదే ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న సినిమా. ఆ తర్వాత తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి 38 లక్షల వ్యూస్ మొదటి వారం లో వచ్చాయి. అదే విధంగా మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’, నాని ‘హాయ్ నాన్న’ చిత్రాలకు మొదటి వారం లో చెరో 20 లక్షల వ్యూస్ ని సంపాదించుకొని టాప్ 3 లో కొనసాగుతుండగా, ‘సత్యం సుందరం’ చిత్రం 19 లక్షల వ్యూస్ తో నాల్గవ స్థానంలో నిల్చింది. ఇక ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఇండియన్ 2’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు నిలిచాయి. సలార్ చిత్రానికి మొదటి వారం లో 16 లక్షల వ్యూస్ రాగా, ‘ఇండియన్ 2’ కి 17 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇలా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలు కూడా ‘సత్యం సుందరం’ క్రింద ఉండడం ఆ సినిమా సాధించిన ఘనత గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే భవిష్యత్తులో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో #RRR రేంజ్ లో ట్రెండ్ అవుతుంది అనిపిస్తుంది.