N convention : N కన్వెన్షన్ నుండి నాగార్జున ఎన్ని వేల కోట్లు సంపాదించాడో తెలుసా..? సంచలన నిజాలు బయటపెట్టిన ప్రభుత్వం!

ప్రెస్ మీట్ పెడితే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదనే విషయం జనాలకు తెలిసిపోతుందని నాగార్జున ఇలా చేశాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

Written By: Vicky, Updated On : August 24, 2024 8:16 pm

Do you know how many thousand crores Nagarjuna earned from N convention

Follow us on

N convention : నేడు హైదరాబాద్ లోని మాధాపూర్ లో అక్కినేని నాగార్జున ఆస్తిగా పిలవబడే ఎన్ కన్వెన్షన్ హాల్ ని అక్రమ కట్టడం గా భావించి ప్రభుత్వం హైడ్రా ద్వారా కూల్చివేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై నాగార్జున ఆందోనళ వ్యక్తం చేస్తూ, హై కోర్టు స్టే ఇచ్చినా కూడా కూల్చేశారు, దీనిపై న్యాయపోరాటం చేస్తాను అంటూ ఒక ట్వీట్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ స్పందిస్తూ ‘ నాగార్జున చెప్పినట్టుగా ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై హై కోర్టు స్టే విధించింది అనేది పూర్తిగా అవాస్తవం. మేము చట్ట ప్రకారమే ఆ కట్టడాన్ని కూల్చివేసాము. FTL లో కట్టడాలు ఉన్నందుకే, నిబంధనలను అనుసరించే ఈ కార్యక్రమం తలపెట్టాము. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్‌ రిక్వెస్ట్ ను గతంలోనే అధికారులు తిరస్కరించారు.అయినా కూడా కట్టారు’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

మరోపక్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ బఫర్ జోన్ లో కాకుండా, ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని, అందుకే కూల్చేవేశామని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఎన్ కన్వెన్షన్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఇక్కడ ఒక్క ఈవెంట్ జరిపించాలంటే రోజుకి 1.7 కోట్ల రూపాయిల నుండి 2 కోట్ల రూపాయిల వరకు ఖర్చు అవుతుందట. అంతే కాకుండా ఈ ఫంక్షన్ హాల్ ఎంత పెద్దది అంటే, ఒకేసారి 10 వేల మంది పట్టేంత ఉంటుందట. ఇక్కడ ఒక ప్లేట్ వెజ్ భోజనం 1600 రూపాయిలు, నాన్ వెజ్ భోజనం 1800 రూపాయిలు ఉంటుందట. గత 12 ఏళ్లుగా నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ ద్వారా సుమారుగా 4 వేల కోట్ల రూపాయిలు ఆదాయాన్ని పొందాడట. అంటే ఏడాదికి సగటు ఆదాయం 350 కోట్ల రూపాయిల పైమాటే. ఇంత ఆదాయాన్ని ఇచ్చే ఈ ఎన్ కన్వెన్షన్ ని పోగొట్టుకున్నందుకే నాగార్జున నేడు అంతలా బాధపడ్డాడు. కేవలం ఒక్క ఎన్ కన్వెన్షన్ నుండే ఈ స్థాయిలో ఆదాయం వస్తే, నాగార్జున కి సంబంధించిన మిగిలిన వ్యాపారాల నుండి ఇంకెంత ఆదాయం వస్తుందో ఊహించుకోవడం కూడా సాధ్యపడట్లేదు కదూ!.

హైదరాబాద్ లో ఆయనకి లెక్కలేనన్ని వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. అయితే N కన్వెన్షన్ కూల్చివేత్తపై సాక్షాత్తు ప్రభుత్వమే హై కోర్టు ఎలాంటి స్టే విధించలేదని చెప్పింది కాబట్టి, నాగార్జున తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. హై కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన కాపీలను ఆయన జనాల ముందు పెట్టాలి. లేకుంటే నాగార్జున ని సొంత అభిమానులు కూడా నమ్మని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీటి గురించి మాట్లాడుతాడని అందరూ అనుకున్నారు. కానీ చాలా తేలికగా ఒక ట్వీట్ వేసి ఊరుకున్నాడు. ప్రెస్ మీట్ పెడితే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదనే విషయం జనాలకు తెలిసిపోతుందని నాగార్జున ఇలా చేశాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.