https://oktelugu.com/

Actress Hema : నటి హేమపై మంచు విష్ణు ఆంక్షలు… ఆ పని చేయకని గట్టిగా చెప్పారా?

నటి హేమ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన ఈ సీనియర్ నటి తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు చెక్ పెట్టాడనే వాదన వినిపిస్తోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 24, 2024 / 07:59 PM IST

    Manchu Vishnu conditions on Actress Hema

    Follow us on

    Actress Hema : మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది హేమ. వందల చిత్రాల్లో లేడీ కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ చేశారు. ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల ఆమె రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపింది. మే 19-20 తేదీల్లో బెంగళూరు నగర శివారులో గల ఓ ఫార్మ్ హౌస్లో బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఆ పార్టీకి హేమ సైతం హాజరైంది. ఈ పార్టీలో నిషేదిత ఉత్ప్రేరకాలు(డ్రగ్స్) వాడుతున్నారన్న సమాచారంతో బెంగుళూరు పోలీసులు రైడ్ చేశారు.

    దాదాపు 100 మంది పాల్గొన్న ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 80 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీసులు నటి హేమ ఫోటో విడుదల చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కథనాలను ఖండిస్తూ హేమ వీడియో బైట్ విడుదల చేసింది. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యానని వస్తున్న వార్తల్లో నిజం లేదని సదరు వీడియోలో తెలియజేసింది.

    హేమ అబద్దం చెప్పారని అనంతరం అర్థమైంది. హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒకటి రెండుసార్లు సాకు చెప్పి తప్పుకున్న హేమకు విచారణ ఎదుర్కోవడం తప్పలేదు. రక్త పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, అందుకే ఆమెను అరెస్ట్ చేశారని వార్తలు వెలువడ్డాయి. రిమాండ్ అనుభవించిన హేమ షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చింది. హేమ జైలు నుండి బయటకు వచ్చి మూడు నెలలు అవుతుంది.

    మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత పరీక్షలు చేయించుకున్న హేమ… తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని అనుకుంటుంది. తన టెస్ట్స్ రిపోర్ట్స్ చూపిస్తూ, ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం అంటూ ఓ వీడియో విడుదల చేసింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో నేను శనివారం జరిగిన పార్టీకి హాజరయ్యాను. ఆదివారం వెళ్ళలేదు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది.

    మూడు నెలల తర్వాత ఎలాంటి పరీక్షల్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియదని కొందరు హేమను ఎద్దేవా చేస్తున్నారు. ఈ పని జైలు నుండి బయటకు వచ్చినప్పుడే ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హేమ మీడియా ముందుకు రావాలని అనుకుందట. అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు గట్టిగా హెచ్చరించాడని సమాచారం. ప్రెస్ మీట్స్ వలన ఈ ఉదంతం మరోసారి హైలెట్ అవుతుంది. పరిశ్రమ పరువుపోతుంది. మీరు ప్రెస్ మీట్స్ పెట్టడానికి వీల్లేదని చెప్పాడట. ఈ మేరకు ఓ వార్త వైరల్ అవుతుంది.