Prabhas Spirit: అనిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే సందీప్ వంగా మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటాడు. ఇక అనిమల్ సినిమాతో స్టార్ డమ్ ని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ని డైరెక్షన్ చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఆయన మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవడం పక్క అంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుండటం కొంతవరకు ప్రభాస్ అభిమానులను నిరాశపరిచే అంశం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకోవాలి అనే విషయం మీద చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయట.
ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డివంగా రణ్బీర్ కపూర్ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనిమల్ సినిమాలో హీరోగా చేసిన రన్బీర్ కపూర్ కి సందీప్ కి మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక దాని కారణంగానే స్పిరిట్ సినిమాలో తనని విలన్ గా చెయ్యడానికి ఒప్పించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రణ్బీర్ కపూర్ ‘రామాయన్’ సినిమాలో రాముడి పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా మీద ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా తర్వాత ‘స్పిరిట్ ‘ సినిమాలో విలన్ గా నటించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఆ పాత్ర కూడా చాలా అల్టిమేట్ గా ఉంటుందట. అందువల్లే రణ్బీర్ కపూర్ ఆ పాత్రని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అనిమల్ సినిమాలో బాబీ డియోల్ పోషించిన విలన్ పాత్ర ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అలాగే ఈ సినిమాలో కూడా రణ్బీర్ కపూర్ క్యారెక్టర్ అంత డీప్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది…