Godfather Satyadev Role: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో హీరోయిన్ మరియు డ్యూయెట్స్ లేకుండా ఒక సినిమా చెయ్యడం ఇదే తొలిసారి..పూర్తి గా పొలిటికల్ నేపథ్యం లో సాగే ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..అక్కడికంటే ఇక్కడ ఎన్నో మార్పులు మరియు చేర్పులు చేసి అసలు మనం చూస్తున్నది మలయాళం లూసిఫెర్ సినిమా రీమేక్ నేనా అనే అనుభూతిని కలిపించేసేలా చేసాడు డైరెక్టర్ మోహన్ రాజా..ఈ చిత్రం లో చిరంజీవి నటనకి ఎంత గొప్ప పేరొచ్చిందో..ఆయన తర్వాత ఈ సినిమాలో అదే రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది సత్యదేవ్ అనే చెప్పాలి..యువ హీరో గా వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న సత్యదేవ్ ఈ చిత్రం లో నెగటివ్ పాత్ర పోషించి మెగాస్టార్ కి ఢీ అంటే ఢీ అనే విధంగా సినిమా మొత్తం కనిపిస్తాడు.

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో పోటీపడి నటించాలంటే చాలా కష్టమైన విషయం..ఆయన ఎదురుగా నిలబడి తడబడకుండా డైలాగ్స్ చెప్పడం ఈ తరం యువ హీరోలకు చాలా కష్టతరమైన విషయం..కానీ సత్యదేవ్ చాలా తేలికగా చిరంజీవి తో తలపడే పాత్రని అద్భుతంగా పోషించి సినిమాకి ఆయువుపట్టులాగ నిలిచాడు..అయితే తొలుత ఈ పాత్ర కోసం తమిళనాడు సీనియర్ హీరో అరవింద్ గో స్వామి తో చేయించాలని చూసారు..ఇది వరకే ఆయన తెలుగు లో రామ్ చరణ్ తో ఆయన ‘ధ్రువ’ అనే సినిమా చేసాడు..ఇందులో ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే.

చిరంజీవి గారి సినిమాలో అవకాశం వస్తే ఆయన వదులుకునే వ్యక్తి కాదు..కానీ అదే సమయం లో ఆయన వేరే సినిమా చేస్తుండడం వల్ల డేట్స్ సర్దుబాటు చెయ్యలేకపోయాడు..ఇక ఆ తర్వాత ప్రముఖ హీరో గోపీచంద్ ని సంప్రదించారట..అయితే హీరో గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ఉండడం తో, విలన్ గా చేస్తే ఆ స్టార్ స్టేటస్ దెబ్బతింటుందని చెయ్యడానికి ఒప్పుకోలేదట..ఇక చివరికి సత్యదేవ్ ని సంప్రదించగానే ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమాని చేసాడు..దానిని ఫలితం ఎలా ఉందొ ఇప్పుడు మన అందరం చూస్తున్నాం..అయితే గాడ్ ఫాదర్ సినిమాని చేయబోతున్నాం అనుకున్నప్పుడు సత్యదేవ్ ని చిరంజీవి తమ్ముడు పాత్రకి తీసుకుందాం అనుకున్నారు..మాతృక ఆ పాత్రని అక్కడి టాప్ హీరో తొనివో థామస్ చేసారు..కానీ ఇక్కడ మాత్రం ఆ పాత్రని తీసివేశారు.