Scariest Job: మామూలుగా ఉద్యోగాలంటే ఎలా ఉంటాయి.. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు.. ఇందులో లక్షల జీతాలు.. ప్రభుత్వం ఉద్యోగం అంటే పనిచేసినా చేయకున్నా నెల తిరిగేసరికి ఠంచనుగా జీతం అకౌంట్ లో పడుతుంది. ఇక లంచాలతో అదనపు సొమ్ము, ఆస్తులు కూడబెట్టిన వారున్నారు. ఇక ప్రైవేటు జాబ్ ల్లో వెట్టి చాకిరీ తప్పదు. జీతం తక్కువ పని ఎక్కువ. సాఫ్ట్ వేర్ లాంటి కొలువులు అయితే లక్షల్లో జీతం.. హాయి అయిన జీతం.. కానీ ప్రపంచంలోనే విచిత్రమైన ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు గుండెబలం ఉన్న వారే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఉద్యోగంగా చెబుతున్నారు.

స్కేర్ టెస్టర్ అనే పేరుతో ఉండే ఈ ఉద్యోగాలు ఇంగ్లండ్ లోని లండన్, బ్లాక్ ఫూల్, ఎడిన్ బర్గ్ , యార్క్ లలో ఉంటాయి. ఈ ఉద్యోగాలు చేసే వారు ఏం పనిచేయాలంటే.. 4 ప్రదేశాలలోని భయానక ప్రదర్శనలను చూడాల్సి ఉంటుంది. అవి చూస్తే గుండె ఆగినంత పని అవుతుందట.. అంత భయంకర ప్రదేశాలవీ..
ఉద్యోగాలు పొందిన వారు మొదట లండన్ లోని అత్యంత భయంకరమైన పాడుబడ్డ భవనం అయిన 50 బెర్క్లీ స్క్వేర్ లో హార్రర్ షో చూపిస్తారు. ఈ పరీక్షలో పాస్ అయితే యార్క్ లో ఆత్మలు, దెయ్యాల ప్రదర్శనను చూడాల్సి ఉంటుంది. ఇదీ గుండె ధైర్యంతో పాస్ అయితే బ్లాక్ ఫూల్ లోని గ్రిమ్ రీపర్ కు వెళ్లి అక్కడి హాలోవీన్ జైల్లో ప్రదర్శనలు చూపిస్తారు.

ఎంతో ధైర్యం, గుండె బలం ఉంటేనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే భయంతోనే చచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే ధైర్యవంతులే ఈ ఉద్యోగాలకు రావాలని సూచిస్తారు. జీతాలు లక్షల్లోనే ఉన్నా ఈ ఉద్యోగం చేయడానికి మాత్రం సాహిసకులే ముందుకు వస్తారు.