https://oktelugu.com/

NTR: మల్టీ టాలెంటెడ్… యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎన్ని సినిమాల్లో పాటలు పాడారో తెలుసా?

ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ రేంజ్ లో వినిపించింది. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ తో పాటు ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. కాగా సింగర్ గా సైతం ఎన్టీఆర్ సక్సెస్.

Written By: , Updated On : February 18, 2024 / 02:06 PM IST
NTR

NTR

Follow us on

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్. ఆయన గొప్ప నటుడే కాదు… ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకున్న ఎన్టీఆర్ బాల్యంలో పలు స్టేజ్ షోలు ఇచ్చారు. గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం మూవీ చేశారు. ఇక టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతికాలంలో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. నూనూగు మీసాల వయసులోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ రేంజ్ లో వినిపించింది. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ తో పాటు ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. కాగా సింగర్ గా సైతం ఎన్టీఆర్ సక్సెస్. ప్రొఫెషనల్స్ తో పోటీపడుతూ ఆయన పలు చిత్రాల్లో సాంగ్స్ పాడారు. ఎన్టీఆర్ మొదటిసారి 2007లో పాడారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ చిత్రంలో… ఓ లమ్మీ తిక్క రేగిందా… సాంగ్ ఆయన పాడారు.

ఈ పాటలో ఎన్టీఆర్ తో డాన్స్ చేసిన మమతా మోహన్ దాస్ సైతం సింగర్. దాంతో ఎన్టీఆర్-మమతా మోహన్ దాస్ ఆడిపాడారు. ఇది అరుదైన రికార్డు. తర్వాత కంత్రీ మూవీలో … 123 నేనో కంత్రీ, సాంగ్ పాడారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ మూవీలో… చారి సాంగ్ పాడారు. తర్వాత రభస చిత్రంలో… రాకాసి రాకాసి, సాంగ్ ని ఎన్టీఆర్ స్వయంగా ఆలపించడం జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలో… ఫాలో ఫాలో యు, సాంగ్ పాడారు.

తన చిత్రాలకు మాత్రమే పాటలు పాడిన ఎన్టీఆర్ మరొక హీరోకి పాడటం విశేషం. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం చక్రవ్యూహ లో గెలెయా… గెలెయా… అనే సాంగ్ ఎన్టీఆర్ ఆలపించారు. ఈ సాంగ్ సూపర్ హిట్. ఆ విధంగా ఎన్టీఆర్ ఆరు చిత్రాల్లో ఆరు పాటలు పాడారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నారు. ఇది దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.