Pooja Hegde: ముకుంద సినిమాతో మంచి నేమ్, ఫేమ్ సంపాదించింది పూజా హెగ్డే. తెలుగు దనం ఉట్టిపడేలా అందరిని ఆకర్షిస్తూ తన నటనతో ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఎంత మాత్రం స్టార్ హీరోయిన్ లకు తీసిపోకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. కానీ తొందర్లోనే బాలీవుడ్ కి చెక్కేసింది ఈ బ్యూటీ.అక్కడ కూడా కలిసి రాకపోవడంతో అల్లు అర్జున్ నటించిన డీజీ సినిమాతో మళ్లీ టాలీవుడ్ కు వచ్చింది. ఇక్కడే ఈమె అదృష్టం మరింత పెరిగింది. టాలీవుడ్ హాట్ బ్యూటీగా మారిపోయింది.
స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి అమ్మడుకు. ఏకంగా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. దీంతో ఈ అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చేసింది. అందుకే ఇతర భాషా చిత్రాల మీద ఫోకస్ పెట్టింది. అలా బాలీవుడ్, కోలీవుడ్‌లో ఆఫర్లు పట్టేసింది. ఇతర ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావడంతో ఆ ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలుగుతంది పూజా హెగ్డే. అన్ని ఇండస్ట్రీలలో టాప్ హీరోలతోనే జత కట్టింది. అదే రేంజ్ లో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. అయితే ప్రస్తుతం పూజా కు సినిమా అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే పూజ వద్ద కాస్ట్లీ కార్లు ఉన్నాయి. రెండు కోట్లకు పైగా విలువైన పోర్షే కారు, కోటి విలువైన లగ్జరీ జాగ్వార్ కారు, ఆడి క్యూ7 కారు కూడా ఉంది. దీని ధర దాదాపు 80 లక్షలు. అంతే కాదు ఆమె వద్ద బిఎమ్‌డబ్ల్యూ 350డి కారు, ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. దీని ధర దాదాపు 22 లక్షలు. పూజా హెగ్డేకి హైదరాబాద్‌లో ఒకటి, ముంబైలో మరో విలాసవంతమైన ఇల్లులు ఉన్నాయి.
సినిమాల ద్వారా అమ్మడు ఈ రేంజ్ లో సంపాదించింది అని అర్థం అవుతుంది. మరి సినిమా ఇండస్ట్రీనా మజాకా. ఒకసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టి అదృష్టం తలుపు తిడితే వరుస ఆఫర్లు కామన్, ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కామన్. ఇవన్నీ జరిగితే రెమ్యూనరేషన్ పెరగడం కూడా కామన్. అందుకే ఇలా సంపాదిస్తుంటారు నటీనటులు.