Nagarjuna: ఆ హీరోయిన్ ని అక్కడ గట్టిగా కొరికిన నాగార్జున… షూటింగ్ సెట్స్ నుండి పరుగులు!

నాగార్జునతో టబు నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ వంటి చిత్రాలు చేశాడు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ హిట్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

Written By: Shiva, Updated On : October 13, 2023 6:08 pm

Nagarjuna

Follow us on

Nagarjuna: కొన్ని విషయాలు చాలా క్రేజీగా ఉంటాయి. వెండితెర మీద ప్రేమికులుగా కనిపించిన నటులు నిజ జీవితాల్లో కూడా లవర్స్ అయిపోతారు. నటన ఎంత ప్రొఫెషన్ అయినా నటించేది మనుషులే కాబట్టి అబ్బాయి, అమ్మాయి దగ్గరగా వచ్చినప్పుడు నరాలు జివ్వుమనడం కామన్. పెళ్ళైన నాగార్జున కూడా ఓ సందర్భంలో అలాగే తొందరపడ్డాడట. ఓ హీరోయిన్ బుగ్గలను చటుక్కున కొరికేశాడట. ఆమె ఎవరో కాదు టబు. అందమైన హీరోయిన్స్ లో టబు ఒకరు. ఈ ముంబై భామ అప్పట్లో కుర్రాళ్ళ కలల రాకుమారి.

నాగార్జునతో టబు నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ వంటి చిత్రాలు చేశాడు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ హిట్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగ్-టబు కెమిస్ట్రీ అద్భుతం. యూత్ కి ఈ చిత్రం తెగ నచ్చేసింది. సందీప్ చౌతా అందించిన సాంగ్స్ సినిమాకే హైలెట్. కాగా ఈ మూవీలో ఓ విచిత్ర సంఘటన జరిగిందట.

ఓ రొమాంటిక్ సన్నివేశంలో నాగార్జున నిజంగానే టబు బుక్క కొరికేశాడట. దాంతో టబు కోపంగా సెట్స్ నుండి వెళ్లిపోయిందట. చేసేది లేక టబుకు నచ్చజెప్పి తీసుకొచ్చారట. తర్వాత వీరి మధ్య సన్నిహితం పెరిగిందట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారట. అయితే నాగార్జున-టబు మధ్య ఉండి ఫ్రెండ్షిప్ కాదు, లవ్ అనే ఓ రూమర్ ఉంది. టబు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాగార్జునను కలుస్తారట. నాగార్జున మీద ఉన్న ప్రేమతోనే వివాహం చేసుకోలేదట.

కాగా ఈ రూమర్స్ ని నాగార్జున గతంలో కొట్టిపారేశారు. టబు నా భార్యకు కూడా మంచి ఫ్రెండ్. అందుకే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అమలను, నన్ను కలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై చాలా రూమర్స్ ఉన్నాయి. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ తో కూడా ఆమె ఘాడమైన ప్రేమాయణం నడిపారనే వాదనలు ఉన్నాయి.