Adipurush Pre Release Event: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేసే ఖర్చు తో ఎన్ని సినిమాలు తియ్యొచో తెలుసా!

ముఖ్యంగా పాటలు గురించి మాట్లాడుకోవాలి. ముందుగా 'జై శ్రీరామ్' పాట ని విడుదల చేసారు. దానికి దేశవ్యాప్తంగా వచినటువంటి రెస్పాన్స్ సాధారణమైనది కాదు. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తుంది. మొన్న జరిగిన IPL మ్యాచ్ లో ఈ పాట వెయ్యగానే గ్రౌండ్ మొత్తం చప్పట్లోతో దద్దరిల్లిపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన 'రామ్ సీత రామ్' పాటకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : June 3, 2023 10:52 am

Adipurush Pre Release Event

Follow us on

Adipurush Pre Release Event: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ఆదిపురుష్’ విడుదల తేదీ దగ్గరకి వచ్చేస్తుంది. ఈ నెల 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ లాగ అనిపిస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా సినిమా పై అంచనాలను అమాంతం పెంచేలా చేసాయి.

ముఖ్యంగా పాటలు గురించి మాట్లాడుకోవాలి. ముందుగా ‘జై శ్రీరామ్’ పాట ని విడుదల చేసారు. దానికి దేశవ్యాప్తంగా వచినటువంటి రెస్పాన్స్ సాధారణమైనది కాదు. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తుంది. మొన్న జరిగిన IPL మ్యాచ్ లో ఈ పాట వెయ్యగానే గ్రౌండ్ మొత్తం చప్పట్లోతో దద్దరిల్లిపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘రామ్ సీత రామ్’ పాటకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అలా విడుదలవుతున్న ప్రతీ పాట మరియు ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6 వ తేదీన తిరుపతి లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 200 మంది డ్యాన్సర్లు మరియు 200 మంది సింగర్లు రాబోతున్నారు. వీళ్లంతా స్టేజి మీద పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారు.అంతే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్స్ వేస్తున్నారట.

దీని కోసం మూవీ టీం సుమారుగా 2 నుండి 3 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారట. అంటే రెండు మూడు ‘బలగం’ లాంటి సినిమాలు తీసే రేంజ్ బడ్జెట్ అన్నమాట. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు రైట్స్ ని 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మరి చిత్రం విడుదల అయినా తర్వాత ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.