Anasuya Bharadwaj: అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. సంపాదన కోట్లకు చేరింది. మీటింగ్స్, షూటింగ్స్ … అంటూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. అందుకే ఏ మాత్రం విరామం దొరికినా అనసూయ ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడతారు. ఇటీవల పెద్ద కొడుకు పుట్టినరోజు కావడంతో ఒక వారం రోజులు వెకేషన్ కి వెళ్లారు. అక్కడ కొడుకు బర్త్ డే వేడుకల్లో మునిగితేలారు. తిరిగి హైదరాబాద్ వచ్చాక వృత్తిపరమైన వ్యవహారాలు చూసుకున్నారు. తాజాగా మరోసారి టూర్ ప్లాన్ చేసినట్లున్నారు. విదేశాల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
భర్త సుశాంక్, అనసూయ విదేశీ వీధుల్లో విహరిస్తున్నారు. ఈ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. రెడ్ టాప్, బ్లాక్ షార్ట్ లో అనసూయ టూ హాట్ గా ఉంది. వెకేషన్ అంటే అటూ ఇటూ తిరగాలి కదా… అందుకు అనువైన బట్టలు ధరించారు. అనసూయ వెకేషన్ లుక్ అదిరింది. నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. అనసూయ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ హ్యాపీ గా బ్రతికేస్తుంది.
అనసూయ లేటెస్ట్ మూవీ విమానం. కొత్త దర్శకుడు శివ ప్రసాద్ తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 9న విడుదల కానుంది. విమానం చిత్రంలో అనసూయ వేశ్య పాత్ర చేయడం విశేషం. కెరీర్లో ఫస్ట్ టైం ఆమె ఈ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. సుమతి అనే వేశ్య పాత్రలో బోల్డ్ సన్నివేశాల్లో అనసూయ కనిపించనుంది. నిజంగా అనసూయ గట్స్ కి ఈ సినిమా నిదర్శనం. విమానం మూవీలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు.
అలాగే పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరిందని సమాచారం. 2023 డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం కలదంటున్నారు. పుష్ప 2లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు పలు ప్రాజెక్ట్స్ అనసూయ చేతిలో ఉన్నాయి. అనసూయ పూర్తిగా యాంకరింగ్ కి దూరమయ్యారు. జబర్దస్త్ వేదికగా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ఆ షోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ తేల్చి చెప్పింది.