Coolie and OG Movie: గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు ‘కూలీ'(Coolie), ‘ఓజీ'(They Call Him OG). ఈ రెండు చిత్రాలకు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ కూలీ చిత్రం కమర్షియల్ గా ఎబోవ్ రేంజ్ లో ఆడగా, ‘ఓజీ’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ గా నిల్చింది. కూలీ కి తమిళం తో పాటు తెలుగు, హిందీ , కన్నడ మరియు మలయాళం భాషల్లో మంచి మార్కెట్ ఉండడం వల్ల 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఓజీ కి కేవలం తెలుగు మార్కెట్ నుండి 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ని జారీ చేసింది. ఈ సర్టిఫికేట్ కారణంగా ఈ రెండు సినిమాలు చాలా నష్టపోయాయి అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట.
రీసెంట్ గానే ‘కూలీ’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) మీడియా తో మాట్లాడుతూ ‘మా చిత్రానికి A సర్టిఫికేట్ రావడం దురదృష్టకరం. ఆ కారణం చేత ఈ సినిమాకు 50 కోట్ల రూపాయిల నష్టం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే 550 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన కూలీ చిత్రం కేవలం 500 కోట్ల దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది అన్నమాట. అదే తరహా లో 370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ‘ఓజీ’ చిత్రం కేవలం 320 కోట్ల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. విపరీతమైన రక్తపాతం, బూతులు ఉండే సినిమాలకు A సర్టిఫికేట్ రావడం లో తప్పు లేదు, సాధారణంగా ఉండే సినిమాలకు కూడా ఈ సర్టిఫికేట్ రావడం ఏంటో అని నిర్మాతల వైపు నుండి ఎదురు అవుతున్న అసంతృప్తి. ‘ఓజీ’ చిత్రంలో కేవలం ఇంట్రడక్షన్ ఫైట్ లో కనిపించిన రక్తానికి A సర్టిఫికేట్ ఇచ్చారట.
ఇంతకంటే దారుణమైన రక్త పాతం ఉన్న సినిమాలకు గతం లో సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ చిన్న చిన్న వాటికే సెన్సార్ సభ్యులు ఇలా A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల మేము చాలా డబ్బులు నష్టపోతున్నాం అంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ గా లోకేష్ కనకరాజ్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా ఈ అంశం పై స్పందించి మాకింత నష్టం వచ్చిందంటూ బహిరంగంగా చెప్పాడంటే, రాబోయే రోజుల్లో A సర్టిఫికేట్ పై పెద్ద రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. A సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల నష్టం ఎందుకంటే, ప్రధాన నగరాల్లో టాప్ మోస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్ళని థియేటర్ లోపలకు అనుమతించరు. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలా ఎన్నో పాపులర్ సిటీస్ తో పాటు, మిగిలిన చిన్న సిటీస్ లో కూడా ఈ రూల్స్ ని కఠినంగా అనుసరిస్తారు.