https://oktelugu.com/

Sankranti Akayaam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్ల రూపాయిలు రావాలో తెలుసా..? వెంకటేష్ కి ఇది పెద్ద పరీక్షే!

గత కొన్నేళ్ల నుండి విక్టరీ వెంకటేష్ సోలో హీరో సినిమాలకంటే ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 02:26 PM IST

    Sankranti Akayaam

    Follow us on

    Sankranti Akayaam : గత కొన్నేళ్ల నుండి విక్టరీ వెంకటేష్ సోలో హీరో సినిమాలకంటే ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత ఆయన సోలో హీరో గా చేసిన చిత్రాలను చేతి వేళ్లతో లెక్కపెట్టొచ్చు. షాడో, బాబు బంగారం, దృశ్యం, గురు, నారప్ప, దృశ్యం 2 , సైంధవ్ వంటి చిత్రాలు చేసాడు. వీటిలో దృశ్యం తప్ప మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా ఆడలేదు. నారప్ప, దృశ్యం 2 చిత్రాలకు మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, ఆ రెండు సినిమాలు నేరుగా ఓటీటీ లో విడుదల అయ్యాయి. దీంతో సోలో హీరో గా విక్టరీ వెంకటేష్ బలమైన బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి 15 ఏళ్ళ పైనే అయ్యింది. అభిమానులు ఆయన నుండి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ని కోరుకుంటున్నారు. ఆ బ్లాక్ బస్టర్ సంక్రాంతి రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

    ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ నుండి ఎలాంటి సినిమా కావాలని అభిమానులు కోరుకుంటారో, అలాంటి సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ‘గోదారి గట్టు మీద’ పాటనే బలంగా వినిపిస్తుంది. ‘గేమ్ చేంజర్’ సాంగ్స్ ని కూడా డామినేట్ చేసి ఈ చిత్రం లోని పాటలు ట్రెండ్ అవుతున్నాయంటే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగిందట. ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టాలి. ఇది వెంకటేష్ కెరీర్ లోనే భారీ బిజినెస్ అని చెప్పొచ్చు.

    అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలని అంటున్నారు. అనుకున్న విధంగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా అందుకుంటుందని, వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈయన తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా ఇదే సీజన్ లో మూడు రోజులు ముందుగా విడుదల కాబోతుంది. ఆ చిత్రానికి కూడా సెన్సార్ నుండి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఈ రెండు సినిమాల నుండి దిల్ రాజు కి లాభాలు ఈసారి మామూలు రేంజ్ లో ఉండదని అంటున్నారు.