https://oktelugu.com/

Devara: దేవర సినిమాలో పెద్ద ఎన్టీయార్ పాత్ర నిడివి ఎంత సేపు ఉంటుందో తెలుసా..?

సినిమా మీద ప్రాణం పెట్టుకొని బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి మాత్రమే ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లు దక్కుతూ ఉంటాయి...ఇక జూనియర్ ఎన్టీయార్ కూడా ఇదే కోవకు చెందుతాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 11, 2024 / 02:47 PM IST

    Devara Movie

    Follow us on

    Devara: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు ‘జూనియర్ ఎన్టీఆర్’… ఆది, సింహాద్రి సినిమాలతో మాస్ హీరోగా ఎదగడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను కూడా తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల నందమూరి అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలు కూడా చాలావరకు అతనికి సపోర్ట్ చేస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచారు. అలాగే కొరటాల శివ కూడా ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆయన ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ చాలా నమ్మకంతో అతనికి సినిమా చేసే అవకాశం అయితే ఇచ్చాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కొరటాల శివ ఈ సినిమా కోసం రాత్రి పగలు కష్టపడి బెస్ట్ ఔట్ పుట్ ను తీసుకు వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని సినిమాని చేసినట్టుగా తెలుస్తోంది.

    మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పెద్ద ఎన్టీఆర్ పాత్ర అయిన దేవర పాత్ర స్క్రీన్ మీద ఎంతసేపు కనిపిస్తుందనే దాని మీదనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజానికి దేవర పాత్ర ఈ సినిమాలో 30 నిమిషాల నిడివితో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఆ 30 నిమిషాల్లోనే దేవర సంచలనాలను సృష్టిస్తాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా మొత్తానికి ఆయన పాత్ర హైలెట్ గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శతృవులను ఎదుర్కొనే పాత్రలో దేవర కీలకమైన డెసిజన్స్ ని తీసుకుంటు,తన వాళ్ళని శత్రువులను నుంచి ఎలా కాపాడుకున్నాడు. తన శతృవులను ఎలా చంపేశాడు అనే పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తుంది.

    ఇక సముద్ర తీరంలో బతికే వాళ్ల బతుకులు ఎలా ఉంటాయి అనేది మన కండ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించడానికి కొరటాల ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యం లో ఈ సినిమా విజయం సాధించాలంటే మాత్రం దేవర పాత్ర ఈ సినిమాకి ఊపిరి పోయబోతున్నట్టుగా సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి….