Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయనకి క్లాస్ ఇమేజ్ మాత్రమే వచ్చింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలి అంటే మాత్రం మాస్ ఇమేజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంటేనే మహేష్ కూడా వాళ్ళ నాన్న లాగా సూపర్ స్టార్ అవుతాడు. అంటూ చాలామంది విమర్శకులు సైతం మహేష్ బాబు మీద చాలా విమర్శలు అయితే చేశారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ మహేష్ ను హీరోగా పెట్టీ చేసిన ‘పోకిరి’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో ఒక్కసారిగా మహేష్ బాబు తనలోని మాస్ యాంగిల్ ను బయటకి తీసి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక దాంతో మాస్ లో సూపర్ స్టార్ గా ఎదిగాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా దాదాపు 50 కోట్లకు పైన వసూళ్లను రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అలాంటి ఒక మంచి హిట్ సినిమా ఇచ్చిన పూరి జగన్నాధ్ ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబుతో ‘బిజినెస్ మేన్ ‘ అనే మరొక సినిమా చేశాడు. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.
అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు. ఇక దానికి కారణం ఏంటి అంటే పూరి జగన్నాథ్ కి మహేష్ బాబు కి మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా బిజినెస్ మేన్ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఇంకో సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి ఒక కథ వినిపించాడు. అయితే ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని మహేష్ బాబు పూరి కి చెబితే పూరి సరే అని వీలైనంత వరకు మార్పులు చేర్పులు చేశాడు. అయిన కూడా మహేష్ బాబు మళ్లీ మార్పులు చేయమని చెప్పడం తో ఇక మార్చడం ఇష్టం లేని పూరి ఇక స్క్రిప్ట్ మార్చడం అనవసరం అనుకొని మార్పులు చేయలేదు. దాంతో స్క్రిప్టు మహేష్ బాబు కి నచ్చక మార్పులు చేయమన్న చేయడం లేదు అంటూ పూరి జగన్నాథ్ మీదకి ఫైర్ అయ్యాడు.
ఇక ఈ క్రమం లోనే పూరి కూడా మహేష్ బాబుకి రెండు సక్సెస్ లను ఇచ్చాను. నన్ను పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశ్యం తో ఆయన కూడా మహేష్ బాబుతో కాకుంటే వేరే వాళ్ళతో సినిమా చేస్తాను అంటూ తన దగ్గరికి వెళ్లకుండా బయటి హీరోలతో సినిమాలు చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక స్క్రిప్ట్ వల్లే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది తప్ప ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ గా గొడవ అయితే జరగలేదనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది…