https://oktelugu.com/

Chiranjeevi Movies: చిరంజీవి సినిమాలో కమెడియన్ గా చేసిన ఈయన ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలుసా..?

మనవాళ్లే కాకుండా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామందిని కూడా తెలుగు వాళ్ళు ఆదరించారు. అందులో ముఖ్యంగా నగేష్, మనోరమ, సెంథిల్ వివేక్, మనోభాలా, సంతానం, వడివేలు జనగ్ రాజ్ లాంటి ఇంకా చాలామంది కమెడియన్సు...

Written By:
  • Gopi
  • , Updated On : April 23, 2024 / 02:21 PM IST

    Do you know how Janagaraj is now

    Follow us on

    Chiranjeevi Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ కి కొదవలేదు ఒకప్పుడు అల్లు రామలింగయ్య దగ్గరనుంచి ఇప్పటి వెన్నెల కిషోర్ వరకు ప్రతి ఒక్కరూ తనదైన రీతిలో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ముఖ్యంగా తెలుగులో బ్రహ్మానందం,ఎమ్మెస్ నారాయణ, ఏవీఎస్ వేణుమాధవ్, సునీల్, అలీ, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ వాళ్ళ సత్తాను చూపిస్తూ ముందుకు సాగారు. ఇక ప్రస్తుతం వెన్నెల కిషోర్ అయితే తనదైన రీతిలో కామెడీని పండించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు…

    ఇక మనవాళ్లే కాకుండా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామందిని కూడా తెలుగు వాళ్ళు ఆదరించారు. అందులో ముఖ్యంగా నగేష్, మనోరమ, సెంథిల్ వివేక్, మనోభాలా, సంతానం, వడివేలు జనగ్ రాజ్ లాంటి ఇంకా చాలామంది కమెడియన్సు మంచి పేరు సంపాదించుకున్నారు.ఇక ఇందులో ప్రతి ఒక్కరు తమిళ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు పొందిన తర్వాత డైరెక్ట్ గా తెలుగులో కూడా సినిమాలను చేశారు. ఇక అందులో జనగ్ రాజ్ అయితే చాలా డబ్బింగ్ సినిమాల్లో కమెడియన్ గా నటించి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా తెలుగు సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. కానీ ఆయన రెండు తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.. ఇక అందులో భాగంగానే చిరంజీవి హీరోగా వచ్చిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించాడు.. ఇక ఈ సినిమాలో ఆయన “ఎక్కడికో వెళ్లిపోయావురా మాలోకం” అంటూ చెప్పే డైలాగులు విపరీతంగా ఫేమస్ అయ్యాయి. ఆయన 1978 వ సంవత్సరం లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇక అప్పటినుంచి దాదాపు 45 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి సేవలను అందిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన సినిమాల పరంగా కొంచెం దూరం అయ్యారు. దాంతో ఆయన సినిమాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయనకు హెల్త్ బాగాలేదు అందుకే సినిమాలు చేయడం లేదు అనే వార్తలు కూడా వచ్చాయి.

    ఇక అది తట్టుకోలేక ఆయనే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్ వ్యూ ఇచ్చారు. ఇక దాంట్లో ఆయన నేను అమెరికాలో సెటిల్ అయ్యాను అంటూ వార్తలు వచ్చాయి. నిజానికి నాకు వీసా కూడా లేదు అమెరికా కు ఎందుకు వెళ్తాను. నేను చెన్నైలోనే ఉన్నాను. నాకు ఎలాంటి జబ్బు చేయలేదు. నా పని నేను చేసుకుంటున్నాను అమెరికాలో ఉన్నాను అని అందరూ ఒక న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల నాకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇప్పటికైనా నేను ఒక మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధంగా ఉన్నాను.గతంలో నేను 90 కేజీల బరువు ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అంతే తప్ప నాకు ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలు లేవు. నేను ఫుల్ యాక్టివ్ గా ఉన్నాను అని తను చెప్పాడు…ఇక ఆయన దాడి అనే రెండో సినిమా కూడా చేశాడు…