NRI Crime : ప్రియురాలిని హతమార్చిన కేసులో సింగపూర్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018 జనవరి 17న భారత సంతతి వ్యక్తి కృష్ణన్ తన ప్రియురాలు మలికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ని తీవ్రంగా గాయపర్చి హతమార్చాడు. ఈ నేరాన్ని కోర్టులో అంగీకరించాడు. ఇదిలా ఉండగా, కృష్ణన్ 2015లో గృహ హింస కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. తీరు మార్చుకుంటానని చెప్పి జైలు నుంచి వచ్చాక ప్రవర్తన మార్చుకోలేదు. మహిళలపై పదేపద గృహహింసకు పాల్పడడంతో న్యామూర్తి కృష్ణన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధస్తూ తీర్పు వెలువరించారు.
ప్రియురాలితో పట్టుబడి..
కృష్ణన్ 2015లో తన ప్రియురాలితో మద్యం సేవిస్తూ భార్యకు రెండ్ హ్యాండెడ్‌గా దొరికాడు. వెంటనే ఆమె నిలదీయడంతో అక్కడే ఉన్న విస్కీ బాటిల్‌తో దాడికి యత్నించాడు. దీంతో ఆమె బతిమిలాడి అక్కడి నుంచి బయటపడింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మల్లికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
వివాహేతర సంబంధం కొనసాగిస్తూ..
జైలు నుంచి వచ్చాక కూడా కృష్ణన్ తన వివాహేతర సంబంధాలు కొనసాగించాడు. ఈ క్రమంలో భార్య పెట్టిన గృహ హింస కేసులో అరెస్ట్ 2018 వరకు జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే కృష్ణన్ జైల్లో ఉన్న కాలంలో మల్లిక పరాయి మగాళ్లతో రిలేషన్‌షిప్ కొనసాగించినట్లు తెలుసున్నాడు. 2018, జనవరి 17న బాగా మద్యం సేవించి ప్రియురాలిపై దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లిక మృతిచెందింది. ఆ రోజు సాయంత్రమే సింగపూర్ ఢిపెన్స్‌కు ఫోన్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
కోర్టులో దక్కని ఊరట..
2015లో గృహ హింస కేసు.. 2018లో హత్య.. వరుస నేరాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. అయితే కృష్ణన్ తరఫు న్యాయవాది ప్రియురాలి మోసాన్ని భరించలేకనే దాడి చేశాడని వాదించాడు. ఇక తన క్లయింట్‌కు మద్యం అలవాటు లేదని సెలవు రోజుల్లోనే తీసుకుంటాడని తెలిపారు. మద్యం మత్తులో చేసిన పనే అయినా హింస చాలా తీవ్రంగా ఉందని కోర్టు అభిప్రాపడింది. మహిళల పట్ల ఇలాంటి వాటిని ఉపేక్షించమని పేర్కొంది. స్త్రీలపట్ల ప్రవర్తించిన హింసాత్మక ప్రవర్తనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.