Ee Rojullo Movie Heroine: ఈ ముద్దుగుమ్మ ఈరోజుల్లో సినిమా హీరోయినా..? ఇంతలా మారిపోయిందే…

Ee Rojullo Movie Heroine: 2013లో వచ్చిన ఈ సినిమాలో శ్రీ, రేష్మ రాథోడ్ ఇద్దరు హీరో హీరోయిన్లు గా నటించారు. అయితే మారుతికి ఇది మొదటి సినిమా కావడంవల్ల అత్యంత తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ గా నిలిపాడు.

Written By: Gopi, Updated On : June 27, 2024 12:57 pm

Ee Rojullo Movie Heroine Reshma Rathore

Follow us on

Ee Rojullo Movie Heroine: మారుతి డైరెక్షన్ లో యూత్ ని బేస్ చేసుకొని వచ్చిన “ఈ రోజుల్లో” సినిమా మంచి విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి ఒక భారీ విక్టరీ నైతే నమోదు చేసుకుంది. ఇక 2013లో వచ్చిన ఈ సినిమాలో శ్రీ, రేష్మ రాథోడ్ ఇద్దరు హీరో హీరోయిన్లు గా నటించారు. అయితే మారుతికి ఇది మొదటి సినిమా కావడంవల్ల అత్యంత తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ గా నిలిపాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రేష్మ రాథోడ్ తెలంగాణ కు చెందిన అమ్మాయి కావడం విశేషం. ఇక మొదట ఈమె మొగలిరేకులు సీరియల్ లో నటించింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన బాడీగార్డ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి నటి గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అప్పుడే మారుతి చేస్తున్న సినిమా గురించి తెలిసి ఆయన ఆడిషన్స్ కి అటెండ్ అయిన ఆమె అక్కడ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ ఆమె ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది.

అవేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ‘ఈ రోజుల్లో’ సినిమా ఇక్కడ సూపర్ సక్సెస్ అయిన తర్వాత అదే సినిమాని కన్నడలో ‘ప్రీతి ప్రేమ’ గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ అమ్మాయి హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక 2018 లో జరిగిన ఎలక్షన్స్ లో బిజెపి పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలోని వైరా శాసనసభ నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయినప్పటికీ ఈమె పరజయాన్ని మూట గట్టుకుంది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆమె బిజెపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతుంది…ఇక ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన హాట్ హాట్ పిక్స్ తో తన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఫోటోలు అయితే పెడుతుంది. ఇక ప్రస్తుతం ఆమె పెట్టిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి…