Comedian Babloo: టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ వస్తుంటారు పోతుంటారు..కానీ కొంతమంది కమెడియన్స్ మాత్రం కెరీర్ లో నుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా, కొన్ని గుర్తుండిపోయే పాత్రల్లో నటించి ప్రేక్షకుల మైండ్ లో ఎప్పటికీ అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు ‘బబ్లూ’. తేజ తెరకెక్కించిన ‘చిత్రం’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా బబ్లూ పెద్ద స్టార్ కమెడియన్ అయితే అవ్వలేదు కానీ, దాదాపుగా ప్రతీ ఒక్క స్టార్ హీరో సినిమాలో ఆయన నటించాడు.
పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇలా ప్రతీ ఒక్కరి సినిమాలో నటించాడు. ఈ హీరోల సినిమాల్లో బాగా పాపులర్ అయిన సన్నివేశాల్లోనే బబ్లూ కనిపించడం విశేషం. వాస్తవానికి ఇతని కామెడీ టైమింగ్ వల్ల మనం పొట్ట చెక్కలు అయ్యే విధంగా నవ్వుకున్నా దాఖలాలు లేవు. కానీ స్టార్ హీరోల సినిమాల్లో నటించడం వల్ల అతను మనకి ఇంకా గుర్తు ఉన్నాడు అని చెప్పొచ్చు.
ఇకపోతే ప్రస్తుతం బబ్లూ ఎక్కడ ఉన్నాడు ఏమి చేస్తున్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. గత కోనేళ్ళుగా సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్న ఆయన కొంత కాలం క్రితమే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, టాలీవుడ్ స్టార్ హీరోలతో పని చేసినప్పుడు ఆయనకీ కలిగిన అనుభూతి ఇవన్నీ షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా సినిమాలకు దూరం అవ్వడానికి గల కారణం కూడా చెప్పుకొచ్చాడు.
అతనికి తన తండ్రి అంటే చాలా ఇష్టమట. కెరీర్ మంచి పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లో బబ్లూ తండ్రి చనిపోయాడట. అప్పటి నుండి బబ్లూ జీవితమే మారిపోయింది, చాలా కాలం వరకు ఏ సినిమాని కూడా ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకున్నా సినిమాలకు కూడా సంపూర్ణమైన దృష్టిని పెట్టలేకపోయాడు. అందువల్లే కెరీర్ లో ఇంత గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. బబ్లూ మాట్లాడిన ఈ మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే.