https://oktelugu.com/

Bellamkonda Sai Sreenivas: అత్యాశకిపోయి కెరీర్ ని సర్వనాశనం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్..ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా!

వ్యూస్ ని చూసి బాగా టెంప్ట్ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ లో ప్రభాస్ హీరో గా నటించిన 'ఛత్రపతి' సినిమాని రీమేక్ చేసాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా వీవీ వినాయక్ వ్యవహరించాడు. కరోనా కారణంగా చాలా కాలం షూటింగ్ ని నిలిపివెయ్యబడ్డ ఈ సినిమాకి బడ్జెట్ తడిసి మోపెడంత అయ్యింది. తెలుగులోనే బెల్లంకొండ కి 20 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ లేదు. ఇక హిందీ లో ఈయనని నమ్మి ఏకంగా 100 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసారు. #RRR మూవీ ని హిందీ లో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Written By:
  • Vicky
  • , Updated On : July 17, 2023 5:14 pm
    Bellamkonda Sai Sreenivas

    Bellamkonda Sai Sreenivas

    Follow us on

    Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ లో మాస్ లో కాస్తో కూస్తో ఇమేజి ఉన్న అతి తక్కువ మంది యంగ్ హీరోలలో ఒకడు బెల్లం కొండా సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి పెట్టిన ఈ యంగ్ హీరో, తొలిసినిమా ‘అల్లుడు శ్రీను’ సూపర్ హిట్ అవ్వడం తో బెల్లం కొండా శ్రీనివాస్ కి టాలీవుడ్ లో మంచి ఆఫర్లు. పర్లేదు ఈ కుర్రాడు యాక్టింగ్ పెద్దగా చెయ్యకపోయినా , ఫైట్స్ మరియు యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటిస్తున్నాడు అని అందరూ అనుకున్నారు.

    అలా కెరీర్ లో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్న బెల్లం కొండా శ్రీనివాస్ కి మాస్ లో మంచి ఇమేజి ఏర్పడింది. ఇతని సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ టాక్ తో సంబంధం లేకుండా వచ్చేవి. అంతే కాదు ఈయన సినిమాలను హిందీ దబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చెయ్యగా వాటికి వందల కొద్దీ మిలియన్ వ్యూస్ వచ్చేవి.

    ఆ వ్యూస్ ని చూసి బాగా టెంప్ట్ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ లో ప్రభాస్ హీరో గా నటించిన ‘ఛత్రపతి’ సినిమాని రీమేక్ చేసాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా వీవీ వినాయక్ వ్యవహరించాడు. కరోనా కారణంగా చాలా కాలం షూటింగ్ ని నిలిపివెయ్యబడ్డ ఈ సినిమాకి బడ్జెట్ తడిసి మోపెడంత అయ్యింది. తెలుగులోనే బెల్లంకొండ కి 20 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ లేదు. ఇక హిందీ లో ఈయనని నమ్మి ఏకంగా 100 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసారు. #RRR మూవీ ని హిందీ లో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    విడుదలైన తర్వాత పాపం ఈ సినిమాకి క్లోసింగ్ లో కనీసం కోటి రూపాయిల నెట్ వసూళ్లు కూడా రాలేదు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ సమయం మొత్తం వృధా అయిపోయింది. పాపం బెల్లంకొండ అటు బాలీవుడ్ కి కాకుండా, ఇటు టాలీవుడ్ కి కాకుండా పోయాడు. అంత పెద్ద నిర్మాత కొడుక్కి ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.