https://oktelugu.com/

Actress Aditi Govitrikar: ‘తమ్ముడు’ లవ్ లీ.. ఇలా మారిపోయిందేంటి?

పవన్ కల్యాణ్ జోరు స్టార్ట్ అయిన తరువాత వచ్చిన మూవీ ‘తమ్ముడ’. అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో, బి. శివరామకృష్ణ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమ్ముడ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు ప్రీతి జింగానియా నటించింది. అయితే ఈమెతో పాటు మోడల్ కాలేజీ అమ్మాయిలా అతిథి గోవత్రికర్ నటించారు. ఈమె ‘లవ్ లీ’ అనే పాత్రలో నటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 14, 2023 / 09:24 AM IST

    Actress Aditi Govitrikar

    Follow us on

    Actress Aditi Govitrikar: సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. ఎంతో ఎత్తుకు ఎదిగిపోతామని అంటుంటారు. కానీ ఇలాంటి ఒక్కఛాన్స్ లు చాలా మందికి చాలానే వచ్చాయి. అలా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే ఆ తరువాత మళ్లీ సినిమాల వైపు చూడని వాళ్లూ చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లలో అతిథి గోవత్రికర్ ఒకరు. ఈమె పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టరు కానీ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ‘తమ్ముడ’ సినిమాలో మెరిసిన ఈ భామ ఆ సమయంలో ఎంతో హల్ చల్ చేసింది. సినిమా మొత్తంలో కీలకంగా నటించిన ఈమె ఈ ఒక్క మూవీలో నటించి ఆ తరువాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఆమె ఫొటోలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే?

    పవన్ కల్యాణ్ జోరు స్టార్ట్ అయిన తరువాత వచ్చిన మూవీ ‘తమ్ముడ’. అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో, బి. శివరామకృష్ణ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమ్ముడ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు ప్రీతి జింగానియా నటించింది. అయితే ఈమెతో పాటు మోడల్ కాలేజీ అమ్మాయిలా అతిథి గోవత్రికర్ నటించారు. ఈమె ‘లవ్ లీ’ అనే పాత్రలో నటించారు.

    అతితి చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగపెట్టారు.ఈ క్రమంలో ఆమెకు తమ్ముడు సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆమెకు తగ్గట్టుగా తెలుగులో పాత్ర లేకపోవడంతో టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ లోకి వెళ్లారు. అక్కడ అమీర్ ఖాన్ తో ‘జో జీతా వహీ సికందర్ ’ సినిమాలో టించింది. అయితే అక్కడా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించిన ఈమె ఆ తరువాత సినిమాలు చేయడం మానుకుంది.

    అయితే ఇన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించని అతిథి ఇప్పుడు సడెన్లీగా ప్రత్యక్షమైంది. కానీ ఇప్పుడు లవ్ లీ పూర్తిగా గుర్తుపట్టకుండా మారిపోయింది. తమ్ముడు సినిమాలో ఎంతో అందంగా ఉన్న అతిథి ఇప్పుడు ఏజ్ బార్ లా కనిపిస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఏం చేసింది? ఎటువెళ్లింది? మాత్రం లవ్ లీ చెప్పలేదు. బహుశా విదేశాల్లో ఉందా? అని కామెంట్లు పెడుతున్నారు.