Indian Spinners Vs Foreign Spinners: క్రికెట్లో బ్యాటర్లదే ఆధిపత్యం.. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జెంటిల్మెన్ లాంటి ఆటలో కొంతమంది బౌలర్లు బ్యాటర్ల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టారు. తమ మణికట్టు ద్వారా బంతులను గింగిరాలు తిప్పి గొప్ప గొప్ప బ్యాటర్లకు కూడా చుక్కలు చూపించారు. ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లే అగ్రగాములుగా ఉన్నారు. అయితే ఈ విభాగంలో విదేశీ స్పిన్నర్లు పులుల్లాగా వికెట్లు తీస్తే.. భారత స్పిన్నర్లు సింహాల్లాగా విజృంభించారు.. అనితర సాధ్యమైన రికార్డులను నెలకొలిపారు. ఇక ఈ జాబితాలో బేడీ_ ప్రసన్న_ చంద్ర, కుంబ్లే_హర్భజన్, అశ్విన్_ జడేజా వంటి బౌలర్లు విజయవంతమైన జోడీలుగా నిలిచాయి. మధ్యలో దిలీప్ జోషి, రవిశాస్త్రి, మణిందర్, శివరామకృష్ణ, వెంకటపతి రాజు వ్యక్తిగతంగా మెరిసినప్పటికీ జోడీగా మాత్రం విజయవంతం కాలేదు.
అనిల్ కుంబ్లే, హర్భజన్
అనిల్ కుంబ్లే 18 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడాడు. టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో అనిల్ ఒకడు. టెస్ట్ క్రికెట్లో 619 వికెట్లు తీశాడు. ఇతడి అత్యుత్తమ బౌలింగ్ భాగస్వామి హర్భజన్ సింగ్. ఇతడు టెస్టుల్లో 400కు పైగా వికెట్లు తీశాడు. టెస్టుల్లో భారతదేశం తరఫున ఈ అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ జోడి 108 ఇన్నింగ్స్ లలో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసింది. వీరిద్దరూ ఉన్న టెస్టుల్లో ఒక్కొక్కరు 200 కు పై చిలుకు వికెట్లు తీసిన ఏకైక స్పిన్నర్లు.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా
రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ టెస్టు బౌలర్ గా కీర్తి గడించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా అవతరించాడు. టెస్ట్ క్రికెట్లో జడేజా తో అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్ కలయిక కలిగిన ఈ బౌలింగ్ జోడి 37 టెస్ట్ మ్యాచ్ లలో 370కి పైగా వికెట్లు తీసింది.
భగవంత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ
1970 వ దశకంలో నలుగురు స్పిన్నర్లు ఎరపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట రాఘవన్, భగవంత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడి విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు. ఉపఖండం వెలుపల సిరీస్ విజయాలలో కీలకపాత్ర పోషించారు. వీరిలో చంద్రశేఖర్, బేడి అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ జోడిగా నిలిచింది. 42 ఇన్నింగ్స్లలో 27.96 సగటుతో 368 వికెట్లు తీశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ విభాగంలో భారత తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బేడీ.
కులదీప్ యాదవ్, యజువేం ద్ర చాహల్
భారత స్పిన్ కు నాయకత్వం వహిస్తున్న కొత్త జోడి ఇది.. ఈ జోడికి “కుల్ చా” అనే మారుపేరు కూడా ఉంది. ఎడమ చేతి ఈ స్పిన్ బౌలింగ్ జంట 34 వన్డేల్లో 25.6 సగటుతో 118 వికెట్లు తీసింది.. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ భారత ప్రధాన స్పిన్ బౌలింగ్ జోడిగా కొనసాగుతున్నారు.
ముత్తయ్య మురళీధరన్, సనత్ జయసూర్య
అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరు కూడా విజయవంతమైన జోడిగా నిలిచారు. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో 1347 వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. ఇతడి అత్యుత్తమ బౌలింగ్ భాగస్వామి జయ సూర్య. ఈ జోడి 486 ఇన్నింగ్స్ ల్లో 1366 వికెట్లు తీశారు.
ముస్తాక్ షాహిద్ అఫ్రిది
వీరిద్దరు కూడా పాకిస్తాన్ జట్టులో అత్యుత్తమ బౌలింగ్ జోడిగా గుర్తింపు పొందారు. వీరిద్దరూ 106 వన్డేల్లో 26.8 సగటుతో 300 పైగా వికెట్లు తీశారు. సక్లైన్ ముస్తాక్ వన్డేల్లో అత్యంత వేగంగా 200, 250 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇతడి బౌలింగ్ భాగస్వామి షాహిద్ ఆఫ్రిది 500 కంటే ఎక్కువ వికెట్లు సాధించాడు.
అబ్దుర్ రజాక్ షకీబ్ అల్ హసన్
వన్డేలో 200 వికెట్లు తీసిన ఏకైక బంగ్లాదేశ్ స్పిన్నర్ అబ్దుర్. జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు, చేసిన ఏకైక ఆటగాడు షకీబ్. ఈ జంట బంగ్లాదేశ్ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ జోడిగా పేరు సంపాదించుకుంది. 113 వన్డేల్లో 30 సగటుతో 287 వికెట్లు తీసింది.