Chalaki Chanti: ఆటపాటలు.. అప్పుడే గొడవలు.. ముద్దు ముచ్చట్లు.. కోప తాపాలు.. ఇవన్నీ కలగలిపి బిగ్ బాస్ షో లో కనిపిస్తున్నాయి. బుల్లితెరపై సూపర్ షో గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ రన్ అవుతోంది. ఇప్పటి వరకు 5 షోలు సక్సెస్ గా కంప్లీట్ చేసుకొని అదే ఊపుతో ఆరో ఎపిసోడ్ కూడా అదే బాటలో వెళ్తోంది. అయితే అంతకుముందు కంటే ఈసారి రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. ఇందులో కొందరు టీవీ రంగం నుంచి రాగా… మిగతా వారు యూట్యూబ్ స్టార్లే ఎక్కువగా ఉన్నారు. ఇక సినిమాల్లో, టీవీ షోల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకీ చంటీ కూడా ఈసారి హౌస్ లోకి వెళ్లిన వారిలో ఉన్నారు. మొదటి నుంచి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న చలాకీ చంటీ ఐదో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఈ సమయంలో ఆయన కళ్లు చెదిరె రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ ఆరో సీజన్ మొదట్లో కాస్త చప్పగా సాగింది. కానీ గీతూ రాయల్ వంటి వారి రాష్ డైలాగ్స్ తో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయినట్లయింది. ఆ తరువాత ఆదిరెడ్డి, రేవంత్ ఇతరులు తమ ప్రతిభను చూపించారు. అవసరానికి మించి హార్డ్ డైలాగ్స్ తో ప్రత్యేకంగా నిలిచారు. మిగతా వారు కూడా వారి హోదాలో సందడి చేశారు. కానీ చలాకీ చంటి మాత్రం ముందు నుంచీ ఎవరితో గొడవపడకుండా మంచి వాడనే ముద్ర వేయించుకున్నాడు. కానీ కంటెస్టెంట్ గా చంటి చలాకీగా వ్యవహరించనప్పటికీ ఆయనకు ఇచ్చిన టాస్క్ లను మాత్రం పూర్తి చేయలేకపోయాడు.
సాధారణంగా కంటెస్టెంట్లు సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న తరువాత.. దానిని క్యాష్ చేసుకొని కెప్టెన్సీ హోదాను దక్కించుకుంటారు. కానీ చలాకీ చంటి మాత్రం చివరిలో గీతూ రాయల్ తో గొడవపడ్డాడు. దీంతో అతడిపై గీతూ రాయల్ నిందలు వేసింది. అలాగే కీర్తీ భట్ అతడి గురించి బ్యాడ్ గా చెప్పింది. దీంతో ఆయనకు మద్దతు తగ్గిపోయింది. అయితే నాలుగో వారంలో చలాకీ చంటికీ కెప్టెన్సీ అయ్యే అవకాశం వచ్చింది. కానీ దానిని సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఇవన్నీ ఆయనకు మైనస్ గా మారి కెప్టెన్సీ హోదా దక్కలేకపోయింది. దీంతో ఐదో వారినికే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

అయితేనే చంటి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 5 వారాల పాటు హౌస్ లో ఉన్న చంటి రోజుకు రూ.60 వేల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన ఆయన వారానికి రూ.4.20 లక్షలు తీసుకున్నాడట. అంటే 5 వారాలకు కలిపి మొత్తం రూ.21 లక్షలతో బయటికి వచ్చాడు. ఈ మొత్తం 4వ సీజన్లో ఫైనల్ వరకు చేరి రన్నరప్ గా సోహెల్ తీసుకున్న తీసుకున్న మొత్తానికి దగ్గరగా ఉంది. అంటే కేవలం ఐదు వారాల్లోనే చంటి ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం. ఇది మిగతా కంటెస్టెంట్ల కంటే చాలా ఎక్కువ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడున్న కంటెస్టెంట్లలో రేవంత్ కే ఈ రెమ్యూనరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చలాకీ చంటీ కూడా ఆ రేంజ్ లోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.