Mahesh Babu Health: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకునే సమయంలోనే మహేష్ బాబు గారి తల్లి ఇందిరా దేవి గారు చనిపోవడం తో తాత్కాలికంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది..తల్లి చనిపోయిన తర్వాత సంప్రదాయం ప్రకారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన మహేష్ ఇప్పుడు లండన్ కి పర్యటించడం పై సోషల్ మీడియా లో పెద్ద చర్చ కి దారి తీసింది.

దసరా తర్వాత త్రివిక్రమ్ తో చెయ్యబొయ్యే సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అనుకుంటే మహేష్ బాబు లండన్ కి పర్యటించడం ఏంటి అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..అంతే కాకుండా ఆయన పర్యటన కి సంబంధించి రకరకాల కారణాలు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ బాబు గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని..కొద్దీ నెలల క్రితమే ఆయన మోకాళ్ళకు సంబంధించి ఒక సర్జరీ చేయించుకున్నాడని..ఇప్పుడు మళ్ళీ మోకాళ్ళు బాగా నొప్పి రావడం తో చికిత్స నిమ్మితం లండన్ కి వెళ్లాడని సోషల్ మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి..అయితే ఈ వార్త ని మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని సన్నిహిత వర్గాలు కొట్టిపారేశాయి.

మహేష్ బాబు కుమారుడు గౌతమ్ లండన్ లోనే చదువుకుంటున్నాడని..తన నాన్నమ్మ చనిపోయిన రోజు కూడా అతను రాలేకపోయాడని..కానీ పెద్ద కర్మ కి వచ్చాడని..ఇప్పుడు గౌతమ్ ని మళ్ళీ తిరిగి లండన్ లో దింపేందుకు మహేష్ బాబు వెళ్లాడని చెప్పుకొస్తున్నారు..వీటిల్లో ఏది నిజమో తెలీదు కానీ, ఒకవేళ చికిత్స నిమ్మితం ఆయన వెళ్తే మాత్రం, మహేష్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి అంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
ఇక మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు మరియు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కూడా టీవీ టెలికాస్ట్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం తో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమా కి మంచి డిమాండ్ ఉంది..వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.