Heroes Remuneration: సినిమాల్లో రెమ్యూనరేషన్ తీసుకోని హీరోలు ఎవరో తెలుసా?

బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటి నుంచి ఈ రెబల్ స్టార్ భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన రూ.25 కోట్లు తీసుకున్నారు. అయితే ఆ తరువాత నుంచి ప్రభాస్ సినిమాల్లో లాభాలను తీసుకుంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : September 5, 2023 5:30 pm

Heroes Remuneration

Follow us on

Heroes Remuneration: ప్రపంచంలో మిగతా రంగాలకంటే సినీ రంగంలో ఎదగాలని చాలా మంది ఇంట్రెస్ట్ పెడుతారు. ఒక్క ఛాన్ష్ వస్తే తన ప్రతాపం చూపించి అవకాశాలు దక్కించుకోవాలని చూస్తారు. మిగతా ఇండస్ట్రీలో కంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. ఈ క్రమంలో సినిమాల్లో నటించే వారికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక హీరో, హీరోయిన్లు కోట్లలోనే పారితోషికం అందుతుంది. ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికి ఇంత రేటు అని ఫిక్స్ చేసేవారు. కానీ ఇప్పటి సినిమా విజయం, అపజయం వెనుక హీరో పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకే సినిమా హిట్టయితే వారికి లాభాల్లో వాటా కూడా ఇస్తున్నారు. ఇటీవల ‘జైలర్’ సినిమా ఊహించని లాభాలు రావడంతో రజనీకాంత్ కు రెమ్యునరేషన్ తో పాటు మరో 100 కోట్లు ఇచ్చారు. ఈ నేపథ్యలో తెలుగు హీరోలు కూడా ఇలా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కానీ కొందరు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమాలు చేశారు. వాళ్లెవరంటే?

బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటి నుంచి ఈ రెబల్ స్టార్ భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన రూ.25 కోట్లు తీసుకున్నారు. అయితే ఆ తరువాత నుంచి ప్రభాస్ సినిమాల్లో లాభాలను తీసుకుంటున్నారు. బాహుబలి ది కంక్లూజన్ కు ప్రభాస్ కు పర్సంటేజీ ప్రకారం గా చెల్లించారు. మిల్క్ బాయ్ మహేష్ బాబు ఒకప్పుడు సాధారణ రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ఏంఎంబీ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన తరువాత లాభాల్లో వాటా తీసుకోవడం ప్రారంభించారు.

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత ఇదే చేస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో కొణిదెల ప్రొడక్షన్ పై తీసి లాభాల్లో వాటా తీసుకున్నారు. పవణ్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత నుంచి సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. దీని ద్వారా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ కు ఆయన 30 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారు. కానీ ధ్రువ చిత్రంతో లాభాల్లో వాటా తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అందువల్ల ఎటువంటి వాటా తీసుకోలేదు.

అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియో ద్వారా నిర్మించిన సొగ్గాడే చిన్ని నాయనా, మనం సినిమాలకు వాటా తీసుకున్నారు. విక్టరీ వెంకటేశ్ బాబు బంగారం, గురు సినిమాల్లో నటించినందుకు లాభాల్లో వాటా ఆర్జించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం వాటా తీసుకోవాలని అనుకున్నాడు తన సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మించిన ‘జై లవకుశ’కు ఈ ప్లాన్ వేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వాటా తీసుకోలేదు.