Sydney Test : రిషబ్ పంత్ 40, రవీంద్ర జడేజా 26 పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా ఆవిర్భవించారు. చివర్లో టీమిండియా కెప్టెన్ బుమ్రా వాయు వేగంతో బ్యాటింగ్ చేశాడు. 17 బంతుల్లో 22 రన్స్ కొట్టాడు. టీమిండియా కు వాల్యుబుల్ స్కోర్ అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ (4/31) నిప్పులు చెరిగాడు. మిచెల్ స్టార్క్ (3/49) అదరగొట్టాడు. కెప్టెన్ కమిన్స్ (2/37) వారెవా అనిపించాడు. లయన్ ఒక వికెట్ సాధించి పర్వాలేదనిపించాడు. టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. భారత బ్యాటర్లు కెప్టెన్ ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. స్టాక్ బౌలింగ్లో ఓపెనర్ రాహుల్ నాలుగు పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పది పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ బోలాండ్ బౌలింగ్లో పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ.. తాను ఎదుర్కొన్న తొలి బంతికే జీవదానం లభించింది. బోలాంటి బౌలింగ్లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని కోహ్లీ వెంటాడాడు. ఆ బంతి స్లిప్ లో ఉన్న స్మిత్ వైపు వెళ్ళింది. అయితే దానిని అందుకునే క్రమంలో స్మిత్ నేలకు తగలడంతో అంపైర్ నాట్ అవుట్ అని ప్రకటించాడు. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ గిల్ తో కలిసి నిదానంగా ఆడాడు. ఈ జోడిని లయన్ విడదీశాడు. గిల్ అనవసరమైన షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. దీంతో అప్పటికే భారత్ 57 పరుగులకు మూడు వికెట్లతో లంచ్ బ్రేక్ వరకు వెళ్ళింది.
ఎదురొడ్డిన రిషబ్
ఆస్ట్రేలియా బౌలింగ్ కు రిషబ్ పంత్ ఎదురొడ్డి పోరాడాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి మరోసారి తన వీక్ పాయింట్ ను సరి దిద్దుకోలేకపోయాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా.. రిషబ్ పంత్ కలిసి ఆడారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ తన శరీరాన్ని అడ్డుపెట్టి మరి వికెట్ కాపాడుకున్నాడు.. అనేకమార్లు గాయాలైనప్పటికీ రిషబ్ పంత్ అలానే ఆడాడు. దెబ్బలు తగలడం వల్ల రిషబ్ అనవసరమైన షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఈ దశలో రవీంద్ర జడేజా (26) కూడా అయ్యాడు. సుందర్ పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో భారత జట్టు 148 రన్స్ కే 8 వికెట్లు లాస్ అయింది. ఈ దశలో కెప్టెన్ బుమ్రా ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తో కలిసి కీలక పరుగులు చేశాడు. భారత జట్టుకు 185 పరుగులు అందించాడు.
తొలి వికెట్ డౌన్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఉస్మాన్ ఖవాజా (2) బుమ్రా చేతిలో అవుట్ అయ్యాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మూడో లో ఒక వికెట్ కోల్పోయి 9 రన్స్ చేసింది.