Victory Venkatesh: తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వరుసలో ఉంటారు. ఇందులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కుటుంబాల గురించి అందరికి తెలిసిందే. కానీ వెంకటేశ్ కుటుంబం గురించి మాత్రం ఎవరికి తెలియదు. ఆయన అలా నడుచుకుంటారు. ఆయన కూతురుకు పెళ్లయిందనే విషయం ఎందరికి తెలుసు. ఎప్పుడూ వెంకటేశ్ సెలబ్రిటీ జీవితాన్ని కోరుకోరు. వ్యక్తిగత జీవితాన్ని అందరికి తెలిసేలా చేయరు. రహస్యంగానే జీవించాలని కోరుకోవడం ఆయన నైజం.

1986లో కలియుగ పాండవులు సినిమా ద్వారా ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. పెళ్లయిన ఏడాదికి అంటే 25వ సంవత్సరాల వయసులో ఆయన సినిమాల్లోకి వచ్చారు. కానీ ఇంతవరకు ఎన్నో చిత్రాల్లో నటించినా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా మందికి తెలియదంటే అతిశయోక్తికాదు. విక్టరీని తన ఇంటిపేరుగా చేసుకుని సినిమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. అందుకే ఆయనకు విజయాలు వెన్నతో పెట్టిన విద్య. వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు.
Also Read: ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయిన ‘ఆడవాళ్లు..’
ఇటీవల ఆయన పెళ్లినాటి ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 35 ఏళ్ల నాటి ఫొటోలో వెంకటేశ్ ఆయన భార్య నీరజలు చూడచక్కని జంటగా కనిపిస్తున్నారు. 25 ఏళ్ల వయసులో వెంకటేశ్ పెళ్లిపీటలు ఎక్కడం తెలిసిందే. దీంతో వెంకటేశ్ గురించి మనకు ఎన్నో విషయాలు తెలియవు. ఆయన కూడా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకే రహస్యమే మెయింటెన్ చేస్తారని తెలుస్తోంది.

నలుగురు పిల్లలున్నా ఎక్కడ కూడా వారు తమ తండ్రి సెలబ్రిటీ అని ఏనాడు చెప్పుకోరు. ఎక్కడ కూడా వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించరు. అందుకే వెంకటేశ్ జీవితం అందరికి తెలియదు. తోటి హీరోలైన బాలయ్య, నాగార్జున, చిరంజీవిలు వారి వ్యక్తిగత జీవితం అందరికి సుపరిచితమే. బయట ప్రపంచానికి తెలిస్తే ఏమవుతుంది. వెంకటేశ్ కు ఎందుకింత సీక్రెట్ అని అందరు ప్రశ్నిస్తుంటారు. కానీ ఆయనకు అదో అలవాటుగా మారిందని చెబుతుంటారు.
Also Read: క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన రష్మీ గౌతమ్
[…] OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే..ఇప్పటివరకు బాలకృష్ణని బోయపాటి చూపినంత పవర్‌ఫుల్‌గా ఎవరూ చూపలేదనే చెప్పాలి. బోయ-బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి చిత్రం ఒకదానిని మించి మరోటి అనేలా విజయాన్ని సాధించాయి. ఈక్రమంలో బాలయ్య-గోపిచంద్ మలినేని కలయికలో వచ్చే చిత్రం కూడా అదే ఫార్మాట్లో ఉంటుందని సమాచారం. కన్నడ చిత్రం మఫ్టీకి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో భారీ మార్పులే చేసి పవర్‌ఫుల్‌గా మార్చాడట క్రాక్ డైరెక్టర్ గోపి. […]
[…] Also Read: Victory Venkatesh: వెంకటేశ్ వ్యక్తిగత జీవితం గుర… […]