https://oktelugu.com/

Prabhas Kalki: కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కోసం అన్ని నిమిషాలు వెయిట్ చేయాలా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా కూడా అలాంటి ఒక ఎలివేషన్స్ తోనే సూపర్ డూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే... ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న కల్కి సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 13, 2024 / 02:39 PM IST

    Prabhas Kalki Movie Latest Updates

    Follow us on

    Prabhas Kalki: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాల కోసం ఆడియెన్స్ విపరీతం గా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా మీద అభిమానులతో పాటుగా సగటు ప్రేక్షకులు కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు చూడడానికి జనాలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఆయన సినిమాల్లో మాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి.

    ఇక రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా కూడా అలాంటి ఒక ఎలివేషన్స్ తోనే సూపర్ డూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న కల్కి సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక పాన్ ఇండియాలో ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలువబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ పదిహేను నిమిషాలు సినిమా సెటప్ కోసం దర్శకుడు టైం తీసుకున్నాడట. ఇక ప్రభాస్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందట. ఇక ఇదిలా ఉంటే 15 నిమిషాల పాటు ప్రభాస్ కనిపించకుండా ఉంటే ఆ సినిమా మీద ప్రేక్షకులు ఎలా రియాక్టు అవుతారు.

    సినిమా చూసే ప్రేక్షకుడు ప్రభాస్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా సెటప్ మొదలు పెట్టుకుంటే బాగుండేది అని వాళ్ళ కొందరు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక సినిమా స్క్రిప్ట్ గురించి తెలియనప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ను వేలెత్తి చూపించే అర్హత మనకు లేదు కాబట్టి ఆ విషయంలో మనం కామ్ గా ఉండటం తప్ప చేసేది ఏమీ లేదని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…