
దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతోంది. సామాన్య ప్రజలలో చాలామంది అసలు నోటు ఏదో నకిలీ నోటు ఏదో గుర్తించలేకపోతున్నారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో 5.45 కోట్లకు పైగా విలువైన నకిలీ నోట్లు పట్టు బడ్డాయంటే దేశంలో ఏ స్థాయిలో నకిలీ నోట్ల చలామణి జరుగుతుందో సులభంగానే అర్థమవుతుంది. అయితే నకిలీ నోట్లను గుర్తించడం ద్వారా మోసపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు.
మన దగ్గర ఉన్న 500 రూపాయల నోటు నకిలీ నోటు అయితే ఏకంగా 500 రూపాయలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలు పాటించడం ద్వారా ఏది అసలు నోటు..? ఏది నకిలీ నోటు..? సులభంగా తెలుసుకోవచ్చు. 500 రూపాయల నోటును కాంతి ముందు ఉంచితే 500 అనే నంబర్ మనకు కనిపిస్తుంది. 45 డిగ్రీల కోణంలో నోటును గమనించినా 500 అని ఉండటాన్ని మనం గమనించవచ్చు.
దేవనాగరి లిపిలో కూడా 500 అని రాసి ఉంటుంది. పాత నోట్లతో పోల్చి చూస్తే 500 నోట్లలో మహాత్మా గాంధీ చిత్రం ధోరణి, స్థానం భిన్నంగా ఉంటాయి. 500 నోటును మడిచిన సమయంలో ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారడం గమనించవచ్చు. కుడి వైపున అశోక స్తంభం, కుడి వైపున సర్కిల్ పెట్టెపై 500 అని రాసి ఉంటుంది. ఎగువ ఎడమ, దిగువ కుడి వైపున నమోదు చేసిన సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవిగా ఉంటాయి.
నోటు వెనుక వైపున నోటు ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ చిహ్నం నినాదం, ఎర్రకోట చిత్రం భారత జెండాతో ముద్రించబడి ఉంటుంది. దృష్టిలోపం ఉన్నవారు అశోక పిల్లర్ చిహ్నం, మహాత్మా గాంధీ చిత్రం, బ్లీడ్ లైన్, కరుకుదనంతో ముద్రించిన చిహ్నంను తాకి నోటు అసలు నోటా..? లేక నకిలీ నోటా..? గుర్తించవచ్చు.