Shobhita in Majili movie : యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని నాగ చైతన్య తీసే సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ లో మచ్చుతునక లాంటి క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో ‘మజిలీ’ చిత్రం కచ్చితంగా ఉంటుంది. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో నాగ చైతన్య కి భార్యగా, ఆయన ప్రేమ కోసం పరితపించే అమ్మాయిగా సమంత నటిస్తుంది. పెళ్ళైన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రమిది. ఈ సినిమాకి ముందు వీళ్లిద్దరు కలిసి ‘ఏ మాయ చేసావే’, ‘ఆటో నగర్ సూర్య’,’మనం’ వంటి చిత్రాలలో నటించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దివ్యంషా కౌశిక్ నటించింది. ఈమెతో ప్రేమలో ఉన్న నాగ చైతన్య, అనుకొని కారణాల వల్ల ఆమె దూరమై చనిపోవడంతో సమంత ని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
ఆ తర్వాత వీళ్ళ మధ్య జరిగే సంఘటనలు చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అయితే మొదటి హీరోయిన్ గా నటించిన దివ్యంషా కౌశిక్ ని ఎంచుకునే ముందు అనేక మంది హీరోయిన్స్ ని సంప్రదించాడట డైరెక్టర్ శివ. అందులో శోభిత దూళిపాళ్ల కూడా ఉంది. శోభిత అప్పటికే అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండేదట. ఎందుకో ఆమె అంటే సమంత కి మొదటి నుండి పడేది కాదట, ఈ సినిమాకి నాగ చైతన్య ఆమెని ఎంచుకొని, కొన్ని సన్నివేశాలను షూటింగ్ కూడా చేశారట. ఈ విషయం సమంత కి ముందుగా తెలియదు. ఆమె షూటింగ్ లొకేషన్ లోకి వచ్చిన తర్వాతనే ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె నాగ చైతన్య తో విభేదించి, ఆమె ఈ పాత్రకి అసలు సరిపోదు, ఆమెని ఈ చిత్రం నుండి తప్పిస్తేనే, నేను ఈ సినిమా చేస్తాను అని తెగేసి చెప్పిందట. దీంతో సమంత కోసం శోభిత ని ఆ సినిమా నుండి తప్పించి దివ్యంషా కౌశిక్ ని తీసుకున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. అప్పటి నుండే సమంత, శోభిత మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. అది పెరిగి పెద్దది అయ్యి, తన భర్త తో విడాకులు తీసుకోవడానికి దారి తీసింది. ఇకపోతే రీసెంట్ గానే నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి తో ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆయన అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన అక్కినేని ఫ్యామిలీ ఈ చిత్రం తో కోలుకోవాలని చూస్తుంది.మరి వాళ్ళు కోరుకున్న హిట్ ఈ సినిమా ద్వారా లభిస్తుందా లేదా అనేది చూడాలి.