కరోనా ఎఫెక్ట్ కారణం గా పలు తెలుగు సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి..దరిమిలా పలువురు నిర్మాతలకు తమ సినిమా విడుదల ఒక గుదిబండగా మారింది. అలా మొదటగా ఏప్రిల్ 29న ” అమృతారామమ్ ” అనే తెలుగు చిత్రం డైరెక్టుగా O T T లో విడుదల అయ్యింది. ఆ క్రమంలో ఇపుడు మరో చిత్రం O T T లో విడుదల అయ్యేందుకు సిద్ధమౌతోంది. 2013లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ” డీకే బోస్ “చిత్రం ఏడేళ్లు కావొస్తున్నా ఇంకా విడుదలకు నోచుకోలేదు దరిమిలా ఆ సినిమాపై హీరో సందీప్ కిషన్ కూడా ఆశలు వదిలేసుకున్నాడు.
అలా 2013లో తెరకెక్కి విడుదల కాకుండా ఆగిపోయిన `డీకే బోస్ ` చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాని అర్థం థియేటర్ లో విడుదల అని కాదు . ఆ సినిమా విడుదల అయ్యేది O T T ప్లాట్ ఫామ్ లో. .. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఇక లాక్ డౌన్ ఎత్తి వేయగానే చిన్న సినిమాలకు థియేటర్ లు దొరకడం అంత తేలిక కాదు. అందుకే “డీకే బోస్” చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో త్వరలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి .