DJ Tillu Collections: తెలుగు ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చిందంటే అందులో ఉన్నది పెద్ద హీరోనా లేక చిన్న హీరోనా చూడకుండా తెగ ఆదరించేస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు తగ్గిపోవడంతో ఆ గ్యాప్ ను డీజే టిల్లు బాగా యూజ్ చేసుకుంది. కామెడీతో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది.

ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నా కూడా బ్రేక్ రాక బాధపడుతున్న హీరో సిద్దు జొన్నలగడ్డ కు dj టిల్లు ఆ బాధను తీర్చేసింది. సిద్దు హీరో గా నేహా శెట్టి హీరోయిన్ గా, విమల్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ విశేష ఆదరణ ను దక్కించుకుంది. ఇప్పటికి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నా కూడా ప్రొడ్యూసర్లు డేర్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు.
అయితే ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తాత ఇలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలోనే ఓ అరుదైన రికార్డును ఈ మూవీ ఇప్పుడు సొంతం చేసుకుంది. అయితే అది థియేటర్లలో మాత్రం కాదండోయ్ ఆహా ఓటీటీలో.
ఆహా ఓటీటీ వేదికగా మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న టువంటి ఈ మూవీకి సంబంధించిన ఓ అరుదైన విషయాన్ని ఇప్పుడు ఆహా సంస్థ వెల్లడించింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఆహా లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ మూవీ క్రాస్ చేసింది. ఆ హాలు ఇప్పటివరకు ఈ ఘనత అందుకున్న తొలి మూవీగా సిద్దు జొన్నలగడ్డ సినిమా రికార్డు సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న మూవీ టీం తో పాటు ఆహా సంస్థ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న సినిమాగా వచ్చినటువంటి డీజే టిల్లు ఇంతటి భారీ ప్రభంజనం సృష్టించడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మూవీతో తో సిద్దూకి నేహా శెట్టి కి భారీగా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.