Divya Bigg Boss: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం, కేవలం ఆరు రోజుల్లోనే మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంది. ఇక నేటి నుండి ఈ చిత్రానికి వచ్చే ప్రతీ పైసా లాభమే. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని, 350 కోట్ల గ్రాస్ ని కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదంతా పక్కన పెడితే అనిల్ రావిపూడి ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతలా ఇష్టపడతారో, ఆయన ఏమి చేసినా క్రింజ్ కామెడీ అంటూ వెక్కరించేవాళ్ళు కూడా అదే రేంజ్ లో ఉంటారు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఫైర్ బ్రాండ్ లాగా అడుగుపెట్టిన దివ్య ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి చిర్రెత్తిపోయేలా చేసింది.
వాస్తవానికి ఈమె ఫేమస్ అయ్యింది రివ్యూస్ ద్వారానే. సినిమా రివ్యూస్ ని సోది లేకుండా చాలా చిన్నగా ఒక్క మాటలో చెప్పేస్తుంది ఈమె రివ్యూలు. అలా పాపులారిటీ తెచ్చుకోవడం వల్లే ఈమె అగ్నిపరీక్ష షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి తన మార్కుని చూపించుకుంది. ఇకపోతే రీసెంట్ గా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం పై నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మీకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నచ్చితే, ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది, మీకు అనిల్ రావిపూడి మూవీస్ అంటే పటాస్, రాజా ది గ్రేట్, F2 రేంజ్ లో ఊహించుకొని వెళ్తే మాత్రం ఈ చిత్రం నచ్చదు’.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి ఏ చిన్న నెగిటివ్ చెప్పినా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది, నువ్వెవరు చెప్పడానికి అని అంటారు కాబట్టి ముందే చెప్తున్నాను, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ సంక్రాంతికి మీరు ఒక రొటీన్ సినిమాని చూడాలనుకుంటే ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి వెళ్ళండి. కామెడీ గొప్పగా లేదు, వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి. బిగ్ బాస్ 9 నుండి వచ్చినప్పటికీ, తనకు ఎంతో ఇష్టమైన భరణి మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గరైనవాడు అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఆమె ఇలాంటి రివ్యూ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు.
View this post on Instagram
