Pushpa 2 Japan Collection: ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ హీరోలు ఎక్కువగా జపాన్ మార్కెట్ పై కన్నేశారు. రాజమౌళి #RRR చిత్రం ఇక్కడ ఏడాదికి పైగా ఆడడం, 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడమే అందుకు కారణం. అందుకే ప్రతీ పాన్ ఇండియన్ హీరో ఇప్పుడు జపాన్ మార్కెట్ పై కన్నేశారు. మన ఇండియా లో ప్రొమోషన్స్ చేయడానికి బద్ధకించే హీరోలు, జపాన్ కి వెళ్లి, అక్కడి థియేటర్స్ లోకి అడుగుపెట్టి , అభిమానులతో కలిసి చిందులు వేయడం లాంటివి చాలానే చేశారు. కానీ జపాన్ లో ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకు దక్కినంత ఆదరణ మిగతా హీరోలకు కరువైంది. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) కి దారుణమైన ఓపెనింగ్ దక్కింది. గత నాలుగు రోజుల నుండి అల్లు అర్జున్ జపాన్ మొత్తం ఈ సినిమా కోసం చుట్టేశాడు.
థియేటర్స్ లోకి వెళ్లి అభిమానులతో జపాన్ లో సంబాషించడమే కాదు, ‘పుష్ప 2’ ఇంట్రడక్షన్ ఫైట్ లో అల్లు అర్జున్ జపాన్ లో చెప్పే డైలాగ్స్ కూడా అక్కడి అభిమానుల కోసం చెప్తాడు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా లోకల్ మీడియా లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసాడు. ఇంత చేస్తే ఈ చిత్రానికి మొదటి రోజు అమ్ముడుపోయిన టిక్కెట్లు, కేవలం 861 మాత్రమే. మరో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. జపాన్ ఫ్యాన్స్ కోసం ఒక్క వీడియో బైట్ కూడా ఇవ్వలేదు. ఆయన రంగస్థలం చిత్రం జపాన్ లో భారీ లెవెల్ లో విడుదలైంది. రెస్పాన్స్ అదిరిపోయింది, మొదటి రోజు 1612 టిక్కెట్లు, రెండవ రోజు 1527 టిక్కెట్లు, ఇలా బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ తో దుమ్ము లేపేసింది ఈ చిత్రం.
ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వడం తో ఎన్టీఆర్ తన దేవర చిత్రాన్ని జపాన్ లో ప్రమోట్ చేసుకున్నాడు , కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. పుష్ప 2 కి కచ్చితంగా వస్తుందని అనుకుంటే, దీనికి దేవర కంటే తక్కువ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీంతో అల్లు అర్జున్ నాలుగు రోజుల నుండి జపాన్ లో చేస్తున్న ప్రొమోషన్స్ కి విలువ లేకుండా పోయింది. జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొట్టమొదటి రోజు అత్యదిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలను చూస్తే RRR చిత్రం 8230 టిక్కెట్లతో మొదటి స్థానం లో ఉండగా, సాహూ చిత్రం 6510 టిక్కెట్లతో రెండవ స్థానం లో, కల్కి 2898 AD చిత్రం 3700 టిక్కెట్లతో మూడవ స్థానంలో, 1612 టిక్కెట్లతో రంగస్థలం చిత్రం నాల్గవ స్థానం లో కొనసాగుతుంది.
