https://oktelugu.com/

Divorce in Thirty Plus: థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?

Divorce in Thirty Plus: గత ఏడాది సమంత-నాగ చైతన్యల విడాకులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించిన సమంత, అనంతరం సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు నుండి అక్కినేని తొలగించారు. ఇంస్టాగ్రామ్ లో జస్ట్ ‘ఎస్’ అనే అక్షరం పెట్టారు. ఆ సమయంలో శాకుంతలం మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అలా మార్చారని అందరూ భావించారు. చిన్నగా అసలు విషయం బయటకు వచ్చింది. సమంత-నాగ చైతన్య విడిపోతున్నట్లు […]

Written By: , Updated On : January 22, 2022 / 02:41 PM IST
Follow us on

Divorce in Thirty Plus: గత ఏడాది సమంత-నాగ చైతన్యల విడాకులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించిన సమంత, అనంతరం సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు నుండి అక్కినేని తొలగించారు. ఇంస్టాగ్రామ్ లో జస్ట్ ‘ఎస్’ అనే అక్షరం పెట్టారు. ఆ సమయంలో శాకుంతలం మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అలా మార్చారని అందరూ భావించారు.

samantha

samantha

చిన్నగా అసలు విషయం బయటకు వచ్చింది. సమంత-నాగ చైతన్య విడిపోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అక్టోబర్ 2న అధికారికంగా సమంత, చైతు విడాకుల ప్రకటన చేశారు. ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు వెల్లడించారు. విడాకుల ప్రకటన అనంతరం కారణాలు విశ్లేషిస్తూ మీడియాలో పలు వాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా అందరూ సమంతను నిందించారు. చివరకు ఆమెకు అఫైర్స్ కూడా అంటగట్టారు.

Also Read: చంద్రబాబు చాణక్యం.. టీడీపీ చేతిలోకి మరో అస్త్రం.. ఈ సారి విక్టరీ గ్యారెంటీ..!

విసిగిపోయిన సమంత కొన్ని మీడియా సంస్థలపై చట్టబద్దమైన చర్యలు తీసుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. విడాకులతో డిప్రెషన్ కి లోనయ్యానన్న సమంత మిత్రుల సహకారంతో బయటపడ్డానన్నారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత సమంత-చైతూ విడిపోయారు. సమంత ప్రస్తుత వయసు 34 కాగా, నాగ చైతన్య 35 ఏళ్ళు దాటేశారు. పర్ఫెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకుల కారణంగా ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ అయ్యారు.

Naga Chaitanya Samantha

Naga Chaitanya Samantha

వయసు రీత్యా సెకండ్ మ్యారేజ్ చాలా త్వరగానే చేసుకోవాలి. లేదంటే వీరిద్దరూ 40 ప్లస్ కి దగ్గరవుతారు. ఈ నేపథ్యంలో ఎవరు ముందుగా పెళ్లి ప్రకటన చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. వరుస చిత్రాలు, సిరీస్లు ప్రకటించిన సమంత పూర్తి దృష్టి కెరీర్ పై పెట్టినట్లు తెలుస్తుండగా, మరో రెండేళ్లు సమంత పెళ్లి చేసుకునే అవకాశం లేదు. నాగ చైతన్య మాత్రం ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ కలదు. సమంతతో పెళ్లి నాగ చైతన్య నిర్ణయం, అది విఫలం చెందింది. ఈ సారి నాగార్జున పూర్తి బాధ్యత తీసుకొని చైతూకు వీలైనంత త్వరగా పెళ్లి చేస్తారని అనిపిస్తుంది.

కాగా ఇప్పుడిప్పుడే సమంత విడాకుల వ్యవహారం జనాలు మర్చిపోతున్నారు. అయితే సమంత సడన్ గా ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి విడాకుల ప్రకటన పోస్ట్ తొలగించారు. దీంతో ఏమిటీ.. సమంత-చైతూ మరలా కలవాలనుకుంటున్నారా? అందుకే సమంత విడాకుల ప్రకటన పోస్ట్ తొలగించారా? అన్న సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత-చైతూ మరలా కలవడం అనేది జరగని పని. వీరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు సమంత ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా అర్థమైంది. సమంత విడాకుల ప్రకటన పోస్ట్ తొలగించడం వెనుక కారణం… అది చూసినప్పుడల్లా సమంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు.

Also Read:   ట్సాప్‌, టెలిగ్రామ్’ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ ఇవే !

Tags