https://oktelugu.com/

Chaitanya Samantha: చైతన్య-సమంత విడిపోయారా లేదా అనేది తేలేది అప్పుడే?

Chaitanya Samantha:  టాలీవుడ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హాట్ కపుల్ గా నాగచైతన్య, సమంత జోడీకి పేరుంది. సమంత టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉంది. నాగచైతన్యతో పెళ్లి అయ్యాక కూడా ఆమె సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే ‘ఫ్యామిలీ మ్యాన్2’ అనే సినిమాను చేసింది. సినిమా విడుదలకి సంబంధించి డేట్ కోసం అభిమానులు ఎలా ఎదురుచూస్తున్నారో, ఇప్పుడు క్వీన్ సమంత – నాగ చైతన్య దంపతులు విడిపోయారా? కలిసి ఉన్నారా? అనే ప్రశ్నకు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2021 / 05:30 PM IST
    Follow us on

    Chaitanya Samantha:  టాలీవుడ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హాట్ కపుల్ గా నాగచైతన్య, సమంత జోడీకి పేరుంది. సమంత టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉంది. నాగచైతన్యతో పెళ్లి అయ్యాక కూడా ఆమె సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే ‘ఫ్యామిలీ మ్యాన్2’ అనే సినిమాను చేసింది.

    సినిమా విడుదలకి సంబంధించి డేట్ కోసం అభిమానులు ఎలా ఎదురుచూస్తున్నారో, ఇప్పుడు క్వీన్ సమంత – నాగ చైతన్య దంపతులు విడిపోయారా? కలిసి ఉన్నారా? అనే ప్రశ్నకు స్పష్టత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి రోజు గడిచేకొద్దీ, సమంత -చైతన్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటూ పుకార్లు మరింత తీవ్రమవుతున్నాయి. సమంత ఈ ప్రశ్నలపై సోషల్ మీడియా నిశ్శబ్దం పాటిస్తుండడంతో ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టైంది.

    చైతన్య-సమంత విడిపోయారా? కలిసి ఉంటున్నారా? అన్న ప్రశ్నకు అక్టోబర్ 6న సమాధానం దొరకనుంది., వీరిద్దరి 4వ వివాహ వార్షికోత్సవం అక్టోబర్ 6. ఈ తేదీని ప్రతి సంవత్సరం వీరిద్దరూ పండుగలా జరుపుకుంటారు. ఈ జంట 2017లో అక్టోబర్ 6న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అభిమానులకు ఒక అద్భుత పండుగలా సాగింది. ఈసారి వివాహ వార్షికోత్సవం సమీపిస్తున్నందున ఆ రోజు సమంత -చైతన్య తమ వార్షికోత్సవంపై ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోతే ఈ హాట్ జంటల వైవాహిక జీవితంలో కలతలు ఉన్నాయని.. దూరంగా ఉంటున్నారని సులభంగా ఒక పెద్ద నిర్ధారణకు రావచ్చు.

    ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో చాలా దూకుడుగా ఉన్నప్పటికీ ఇటీవల చైతన్యతో తన బంధానికి సంబంధించి సమంత నోరు మెదపడం లేదు. ఇన్‌స్టా ,ట్విట్టర్ టైమ్‌లైన్‌లో వస్తున్న అనేక పోస్ట్‌లపై సమంత మౌనంగా ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇటీవలే సమంత తన ఇంటిపేరు మార్చడం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూయర్ క్విజ్ చేసినప్పుడు చైతన్యతో విడిపోయావా? అంటే సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తానని సమంత చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె వివాహ వార్షికోత్సవం నాడైనా స్పందిస్తుందా? ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.