Divi Vadthya : త్వరలో పెళ్లి అనగా అతని మరణం… బిగ్ బాస్ దివి లవ్ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు!

దివి బీటెక్, ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించిందట. ఆరేళ్ళు వారిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారట.

Written By: NARESH, Updated On : February 26, 2024 10:21 am

Divi Vadthya

Follow us on

Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చింది . ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆశించిన గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసింది. హౌస్ లో ఉంది తక్కువ కాలమే అయినా ప్రేక్షకుల మనసు దోచింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక దివికి ఆఫర్స్ పెరిగాయి. వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తుంది. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇక గ్లామర్ షో లో ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది.

కాగా దివి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు .. ఆమెకు ఒక లవ్ స్టోరీ ఉందని. అతనితో బ్రేకప్ అయ్యిందని చెప్పింది. కానీ కారణాలు మాత్రం సీక్రెట్ ఉంచింది. తాజాగా ఆమె బ్రేకప్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. జోర్దార్ సుజాత హోస్ట్ గా ఉన్న టాక్ షోకి దివి హాజరైంది. జోర్దార్ సుజాత ఆమెను పలు విషయాలు అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత దివి లవ్ స్టోరీ చెప్పమని సుజాత అడిగింది.

దివి బీటెక్, ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించిందట. ఆరేళ్ళు వారిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారట. దివి గురించి అంతా అతనికి తెలుసట. కాగా దివికి ఇంట్లో వేరే పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుండగా .. అతను వచ్చి దివి ఇంట్లో వాళ్లతో మాట్లాడి అతనితో పెళ్ళికి ఒప్పించాడట. వాళ్ళ పెళ్లి కూడా ఫిక్స్ అయిందట. త్వరలో పెళ్లి అనగా అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయాడట.

దీంతో చాలా కాలం పాటు వాళ్లిద్దరి పెళ్ళికి బ్రేక్ వచ్చిందట. పైగా ఆ అబ్బాయి ఇంటి బాధ్యతలు తీసుకున్నాడట. తల్లిదండ్రులను వదిలేసి హైదరాబాద్ రాలేక ఊళ్ళోనే ఉండిపోయాడట. ఇక దివి అక్కడికి వచ్చి ఉండలేదని. ఆమెకు హైదరాబాద్ లో కెరీర్ ఉందని బ్రేకప్ చెప్పేశాడట. కానీ అతను ఆ టైం లో ఒక్కమాట అడిగి ఉంటే … అన్ని వదిలేసి అతని కోసం ఊరుకెళ్ళిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నానని .. కానీ అతడికి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారని దివి ఎమోషనల్ అయింది.