https://oktelugu.com/

ప్రభాస్ కి బాధ చెప్పుకున్న హాట్ బ్యూటీ !

బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనగానే ఎంతమంది అందగత్తెలు గుర్తుకువచ్చినా వారిలో ఎక్కువుగా ఫోకస్ అయ్యేది మాత్రం ‘దిశా పటాని’నే. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ లో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది ఈ బ్యూటీ. అయితే, ఈ భామ ప్రభాస్ ని కలిసి బాధ పడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ప్రభాస్ ని కలిసి బాధ పడటానికి కారణం ఏమిటా అని ఆరా […]

Written By:
  • admin
  • , Updated On : March 8, 2021 / 04:22 PM IST
    Follow us on


    బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనగానే ఎంతమంది అందగత్తెలు గుర్తుకువచ్చినా వారిలో ఎక్కువుగా ఫోకస్ అయ్యేది మాత్రం ‘దిశా పటాని’నే. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ లో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది ఈ బ్యూటీ. అయితే, ఈ భామ ప్రభాస్ ని కలిసి బాధ పడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ప్రభాస్ ని కలిసి బాధ పడటానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే.. పెద్ద కారణమే కనిపిస్తోంది.

    Also Read: ‘సారంగ ద‌రియా’ క్రెడిట్ ఎవ‌రిది? కొన‌సాగుతున్న ర‌చ్చ‌!

    ప్రభాస్ ‘సలార్’ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ ‘దిశా పటాని’నే. పైగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ సరసన ఈ భామ అయితేనే బాగుంటుంది అని ఆమెకు కథ కూడా చెప్పాడు. వెంటనే నటిస్తా అని ఒప్పేసుకుంది దిశా. కానీ ఆ తరువాత ఆమెకు డేట్స్ సమస్య వచ్చింది. అప్పటికే ఒప్పుకున్న సినిమాల కారణంగా.. సలార్ కోసం ఈ బాలీవుడ్ భామ ఇప్పటికిప్పుడు 60 రోజుల పాటు డేట్స్ ఇవ్వలేక మొత్తానికి సినిమాలో తన పార్ట్ వరకూ పోస్ట్ ఫోన్ చేయమని కోరింది.

    అయితే దర్శకుడు ప్రశాంత్ మాత్రం ఆమెని పక్కన పెట్టారు. సౌత్ ఇండియన్ హీరోయిన్ శృతి హాసన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు. అయితే తాజాగా తానూ ముంబైలో వేరే సినిమా షూటింగ్ కోసం ఓ స్టూడియోకి వచ్చింది దిశా. అక్కడ ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని.. మొత్తానికి ప్రభాస్ ను కలిసిందట దిశా. కలిసి మీతో నటించే అవకాశం మిస్ అవ్వడంతో చాల బాధ పడ్డాను అని తన బాధను చెప్పుకుందట. మరి అమ్మడు బాధ విన్న ప్రభాస్, తన తరువాత సినిమాలోనైనా ఈ హాట్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

    Also Read: పవన్ కళ్యాణ్ మొద‌టి భార్య‌ పేరు మారింది.. ఎక్క‌డ ఉందో తెలుసా?

    ఇక ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే వారంలో మళ్ళీ మొదలు కానుంది. స్పీడ్ గా సినిమాని పూర్తి చెయ్యాలనేది మేకర్స్ పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ వేస్తున్నారు. అందుకే ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం బల్క్ గా డేట్స్ ఇచ్చాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్