బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపికా పడుకోణె’ అసలు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు ఒప్పుకుంటుంది. పెళ్లి అయినా.. ఫ్యామిలీ లైఫ్ ను త్యాగం చేసి మరీ, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలడం లేదు. పైగా పెళ్లి అయ్యాకే ఫుల్ బిజీ అయిపోయింది ఈ భామ. ప్రస్తుతం దీపక చేతిలో ఏకంగా ఆరు సినిమాలున్నాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు. దీపక ఎంతలా సినిమాల కోసం తాపత్రయ పడుతుందో. కియారా లాంటి యంగ్ బ్యూటీకి కూడా ఇన్ని సినిమాలు లేవు. వాళ్ళు కూడా వచ్చిన సినిమా అల్లా చేయకుండా పర్సనల్ లైఫ్ లో కాస్త స్పెస్ ను ఉంచుకుంటున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు మారింది.. ఎక్కడ ఉందో తెలుసా?
అయితే దీపికా వరుసగా సినిమాలు అయితే ఒప్పుకుంటుంది గానీ, అసలు ఆమె అన్ని సినిమాలకు కరెక్ట్ గా డేట్స్ ఇవ్వగలదా ? ఎందుకంటే దీపక చేస్తోన్న సినిమాలు అన్ని భారీ సినిమాలే. పైగా అన్ని సినిమాల్లో స్టార్ హీరోలే. మరి వారి డేట్స్ కి అనుగుణంగా దీపక తన డేట్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఆమె అన్ని పెద్ద సినిమాలకు ఒకేసారి ఎలా న్యాయం చేస్తోంది అని డౌట్ పడుతున్నారు ఆమెతో సినిమాలు చేస్తోన్న మేకర్స్.
ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాకి అనుకున్న టైంకి డేట్స్ ను దీపికా ఇవ్వగలదా అని ప్రభాస్ – నాగ్ అశ్విన్ టీమ్ ఆలోచనలో పడిందట. నిజానికి దీపిక పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. కానీ అప్పుడు కూడా ఆమె వరుసగా యాడ్స్ చేసింది. ఎక్కడా వన్ మంత్ కూడా ఇంట్లో ఉండలేదట. దీపిక తనకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. దాంతో అరడజన్ సినిమాలు సైన్ చేసింది.
Also Read: ‘సారంగ దరియా’ క్రెడిట్ ఎవరిది? కొనసాగుతున్న రచ్చ!
ఇంతకీ ఆ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ డైరెక్క్షన్లో మూవీ, హృతిక్ రోషన్ తో “ఫైటర్”, అలాగే షారుక్ హీరోగా “పఠాన్”, మరియు శకున్ బాత్రా డైరెక్షన్లో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా ఒక రొమాంటిక్ డ్రామా, మహాభారత్, ఒక హాలీవుడ్ మూవీ రీమేక్ ఇలా ఉంది ఆమె సినిమాల లిస్ట్. ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా దీపికా మాత్రం గ్యాప్ ఇచ్చేలా లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్