Chiranjeevi- Pawan Kalyan: ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు మెగా ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో సక్సెస్ కావడం అనేది తమాషా విషయం కాదు. కానీ అది మెగా ఫ్యామిలీకి సాధ్యమైంది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అన్నదమ్ములు కూడా సినీ రంగంలో నిలదొక్కుకున్నారు.
కాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మెగా పవర్ హీరోలుగా నిలబడగా నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రతి హీరోకి వరసగా హిట్లు రావడం అనేది అసాధ్యమే. అలానే పోయిన సంవత్సరం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సాధించిన మెగా హీరోలు ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా సూపర్ హిట్
రేసులో వెనకబడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క మెగా హీరో మాత్రం బ్లాక్ బస్టర్లు సాధించారు. నాగబాబు నటించే చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. నాగబాబు చేసిన బేబీ, జైలర్ చిత్రాలు ఎంత పెద్ద హిట్లుగా నిలిచాయో చెప్పాల్సిన పని లేదు.
ఈ మధ్య విడుదలైన చిరంజీవి భోళా శంకర్, పవన్ కళ్యాణ్ బ్రో, వరుణ్ తేజ్ గాండివధారి అర్జున ఇలా అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆరలేకపోయాయి. అలానే ప్రస్తుతం వస్తున్న వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా పైన కూడా ప్రేక్షకులకు అంచనాలు లేవు. అంతేకాదు ఈ హీరో ఉప్పెన తరువాత మళ్లీ ఇంత వరకు హిట్ కొట్టలేకపోయాడు. ఇలా మెగా హీరోలు రేసులో కాస్త వెనుకబడి ఉన్నారు.
కాగా ఇలాంటి తరుణంలో నాగబాబు మాత్రం తను నటిచ్చిన చిత్రాలతో సూపర్ హిట్లు అందుకుంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా హిట్లు ఇస్తూనే ఉంటారని మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ఇక జైలర్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆ సినిమా చేసిన వారందరికీ థాంక్స్ చెబుతూ నోట్ విడుదల చేశాడు నెల్సన్. దానికి నాగబాబు రిప్లై ఇచ్చాడు. మీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు.