Bigg Boss 7 Telugu: నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ అధ్యంతం నామినేషన్ల పుణ్యమా అని కొట్లాటలతో గడిచిపోయింది. నామినేట్ అయిన వారిలో ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి టేస్టీ తేజ. మొదటిగా అతన్ని నామినేట్ చేయడానికి వచ్చిన శుభ శ్రీ…ఇంటికి సంబంధించిన ఎటువంటి పనులలో తేజ పాల్గొనడం లేదని.. అలాగే టాస్కులు చేసేటప్పుడు సిరియాసిటీ లేదని పేర్కొంది. తేనే పద్యంలో బాత్రూం క్లీనింగ్ శోభకు తేజకు మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా ఆమె ప్రస్తావించింది.
అయితే తేజ అది నాకు శోభకు మధ్య జరిగిన విషయం ..తను అలా అంటూనే ఉంటుంది ..అది మా మధ్య కామన్ దాంతో నీకేంటి ప్రాబ్లం అని ప్రశ్నించాడు. ఇక వర్క్ విషయానికొస్తే అందరితో పోల్చుకుంటే తక్కువ చేసానేమో కానీ అస్సలు చేయకుండా అయితే లేను కదా అని తేజ అన్నాడు. ఆ తర్వాత నామినేట్ చేయడానికి వచ్చిన రతికా…తేజ నువ్వు తినగానే పడుకుంటున్నావు.. పైగా నాకు నీతో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది అని అంది.
ఏదో సందర్భంలో తేజ ఏం పీకుతున్నావ్ అని అన్నాడట…ఆ బోర్డింగ్ తనకు నచ్చలేదు అని అందుకే నామినేట్ చేస్తున్నట్లుగా రతికా అంది. దానికి హైపర్ అయిన తేజ తిని తొంగుంటున్న అని నువ్వు అన్నప్పుడు ఏం పీకుతున్నావ్ అంటే తప్పేంటి అని వాదనకు దిగాడు. ఎవరైనా చెబితే తప్ప తేజ పనిచేయటం లేదు అనేది రతికా వాదన. అయితే దీనికి తేజ వేరే వాళ్ళు చేస్తున్న పనిని మధ్యలో ఆపి పక్కకు రాని వాళ్ళని నెట్టేసి నన్ను పనిచేయమంటావా అని అడిగాడు.
పడుకుంటాను అవసరమైతే పోర్లుతాను …మధ్యలో నీకెందుకు.. ఇంట్లో పడుకోవడం నాట్ అలవాడండి చెప్పడానికి బిగ్ బాస్ ఉన్నారు.. అని తేజ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు నామినేట్ అయ్యాక కూడా వెళ్లి తన చేసే పని అదేనని…తేజ తేల్చి చెప్పాడు. ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. ఇక ఆ తర్వాత తేజకి ఓటు వేయడానికి వచ్చిన పల్లవి ప్రశాంత్ తాను కింద పడుకోవడంపై తేజ అభ్యంతరం వ్యక్తం చేశాడని ఆ కారణం చేత నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్ , శివాజీ ,ఆ తర్వాత స్థానంలో తేజా ఉన్నాడు.