RRR : రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరింప చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన తెలుగోళ్ల ప్రతిభ ని మెచ్చి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారంటే రాజమౌళి విజన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ టాలెంట్ వల్లనే సాధ్యమైంది. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలను ఎలా తీశారు, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది అనేది చూసే ప్రతీ ఆడియన్స్ కి కలిగిన సందేహం. ఎలా అయినా దాని గురించి తెలుసుకోవాలనే తపన ప్రతీ ఒక్కరిలోనూ ఉండేది. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ ని ఒక డాక్యుమెంటరీ రూపం లో ఎడిట్ చేసి, నిన్న కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో విడుదల చేసారు. దీనికి చాలా పూర్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కనీసం దీనిని డాక్యుమెంటరీ గా మార్చినందుకు అయ్యినంత ఖర్చులు కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు.
హైదరాబాద్ లోని AMB ముట్లిప్లెక్స్ తో పాటు, ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్ స్క్రీన్స్ లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేసారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇతర ప్రధాన నగరాల్లో కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ఈ డాక్యుమెంటరీ ని ప్లే చేసారు. అన్ని థియేటర్స్ కి కలిపి కనీసం పది లక్షల రుపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ డాక్యూమెంటరీ చిత్రానికి కేవలం రెండు లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఆ విధంగా రాజమౌళి కెరీర్ లో మొట్టమొదటి ఘోరమైన డిజాస్టర్ ఈ డాక్యుమెంటరీ చిత్రమేనని, ఇలా థియేటర్స్ లో విడుదల చేసి లేనిపోని ప్రయోగాలు చేయకుండా, ఓటీటీ లో విడుదల చేసుంటే చాలా బాగుండేది అని, ఇప్పుడు అనవసరం గా రాజమౌళి ఖాతాలో ఒక బ్లాక్ మార్క్ పడిందంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ డాక్యుమెంటరీ ని చూసిన వాళ్ళు మాత్రం చాలా మెచ్చుకుంటున్నారు. మీ సమీపం లో ఉన్న థియేటర్స్ లో ఈ డాక్యుమెంటరీ ని ప్రదర్శిస్తూ ఉంటే కచ్చితంగా వెళ్లి చూడండి అని, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత కష్టపడి పని చేసారో తెలుస్తుందని, మంచి థియేట్రికల్ అనుభూతి కలిగించిందని చెప్పుకొచ్చారు. ఆ డాక్యుమెంటరీ కి సంబంధించిన కొన్ని థియేటర్ విజువల్స్ ని అభిమానులు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఈ డాక్యుమెంటరీ ని ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. నెట్ ఫ్లిక్స్ కి ఈ డాక్యుమెంటరీ ని ఇస్తారా?, లేదా జీ తెలుగు కి ఇస్తారా?, ఇవి రెండు కాకుండా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ డాక్యుమెంటరీ ని కొనుగోలు చేస్తుందా అని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు .