Vikram TRP Rating: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి విక్రమ్..కమల్ హాసన్ హీరో గా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అన్ని భాషలకు కలిపి దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా సాధించింది..చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కి ఈ సినిమా భారీ కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి..ఇక తెలుగు లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది..కేవలం 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..డిస్ట్రిబ్యూటర్స్ కి పెట్టిన ప్రతి పైసాకి పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా..అయితే థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యింది OTT లో విడుదలైన తర్వాత అంత తక్కువ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం.

ఈ చిత్రం OTT రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ వారు కొనుగోలు చేసారు..ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని టీవీ లో మా టీవీ లో టెలికాస్ట్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..టీవీ లో దుమ్ము లేపేస్తుంది అని అనుకున్న ఈ సినిమాకి కేవలం 5 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..ఒక విధంగా చెప్పాలంటే ఇది డిజాస్టర్ రేటింగ్స్ అనే చెప్పాలి..ఎందుకంటే స్టార్ మా వంటి ఛానల్ లో ఎంత పెద్ద ఫ్లాప్ సినిమాకి అయినా కనీసం 7 తృపి రేటింగ్స్ రావడం సర్వసాధారణం.

కానీ థియేటర్స్ లో 400 క్తోల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఒక చిత్రానికి ఇంత తక్కువ TRP రేటింగ్స్ రావడం ఇదే తొలిసారి..అయితే యాక్షన్ మరియు మాస్ సినిమాలకు TRP రేటింగ్స్ ఇలాగె ఉంటాయంటున్నారు విశ్లేషకులు..ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన KGF చాప్టర్ కి కూడా కేవలం 8 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు..యాక్షన్ సినిమాలకు బుల్లితెర మీద దక్కే ఆదరణ అంతంత మాత్రమే.