Directors Who Deceived Audience: సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చాలా వైల్డ్ గా చూడాలని అనుకుంటారు. కారణం ఏంటంటే స్క్రీన్ మీద కనిపించే హీరోలో ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కాబట్టి తను కూడా ఆ సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. అందువల్లే హీరోయిజం ఎక్కువగా ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. కొంతమంది దర్శకులు కావాలనే ప్రేక్షకులను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. కారణం ఏంటి అంటే కొన్ని షాట్స్ సీన్స్ ని ట్రైలర్ లో చూపిస్తున్నారు. సినిమా థియేటర్ కి వచ్చేసరికి మాత్రం ఉండటం లేదు. దాంతో విసుగు చెందిన ప్రేక్షకులు సైతం ఆ సినిమాని రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అలా చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ లను మూటగట్టుకున్నాయి. స్పైడర్ సినిమాలో మహేష్ బాబు ట్రైలర్ లో చూపించిన కొన్ని సన్నివేశాలు సినిమాలో లేవు. అందువల్ల ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. దాంతో సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ‘ఐ’ సినిమాలో సైతం ఇదే జరిగింది.
అనిమల్ గెటప్ లో హీరో కనిపించబోతున్నాడు అంటూ ట్రైలర్ రివిల్ చేశారు. కానీ కట్ చేస్తే అది ఒక సాంగ్ కి మాత్రమే పరిమితం చేశారు. దాంతో విసుగు చెందిన జనాలు ఆ సినిమాకి పెద్దగా కనెక్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది… ఇక ఇప్పుడు రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా పరిస్థితి కూడా అలాగే తయారైంది.
ట్రైలర్ లో చూపించిన ప్రభాస్ ముసలి గెటప్ ఎపిసోడ్స్ అలాగే జోకర్ గెటప్ లో ఉన్న సీన్స్ సినిమాలో మిస్ అయ్యాయి. దానివల్ల ప్రేక్షకులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకోవడానికి కూడా కారణాలనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా సినిమాలను చూసే ప్రేక్షకులు చాలా తెలివైన వారు. వాళ్లు సైతం ఆ సినిమాలను తిప్పి కొట్టి మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు అనే రేంజ్ లో వ్యవహరిస్తున్నారు.
కాబట్టి ఇప్పటికైనా దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలను చేసి సినిమాలో ఏ షాట్ అయితే ఉంటుందో ఏ సీన్స్ అయితే ఉంటాయో వాటినే ట్రైలర్ లో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయగలిగితే మంచిదని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…