https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున ఇతర భాషల్లో ఎందుకు ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు?

నాగార్జున బాలీవుడ్ డైరెక్టరైన మహేష్ బట్ తో క్రిమినల్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చినా.. ఫ్లాప్ ను మూట గట్టుకుంది. దీంతో నాగార్జునకు ఉన్న ఇమేజ్ మొత్తం పోయిందనే చెప్పాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 2, 2024 / 12:37 PM IST
    Follow us on

    Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ లతో దూసుకొని పోతూ.. ఈ వయసులో కూడా హీరోగా నటిస్తూ హిట్ లను సొంతం చేసుకుంటున్నాడు. అయితే ఈయనకు తెలుగు డైరెక్టర్లు ఎన్నో హిట్ లను అందించారు కానీ ఇతర భాషల డైరెక్టర్లు మాత్రం ఫ్లాప్ లను ఇచ్చారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..

    క్రిమినల్: నాగార్జున బాలీవుడ్ డైరెక్టరైన మహేష్ బట్ తో క్రిమినల్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చినా.. ఫ్లాప్ ను మూట గట్టుకుంది. దీంతో నాగార్జునకు ఉన్న ఇమేజ్ మొత్తం పోయిందనే చెప్పాలి.

    కిల్లర్: కిల్లర్ సినిమాకు ముందు నాగార్జున మంచి విజయాలను అందుకొని సక్సెస్ బాటలో ఉన్నాడు. కానీ ఈ సినిమా తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఫాజిల్ డైరెక్షన్ లో వచ్చిన కిల్లర్ సినిమా ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నాగార్జునకు ఏ రకంగా కూడా హెల్ప్ కాలేదు.

    రక్షకుడు: భారీ అంచనాలతో వచ్చిన రక్షకుడు సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ అవడంతో నాగార్జున కి భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాను తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రవీణ్ గాంధీ డైరెక్షన్ చేయడం విశేషం.

    నిర్ణయం.. మలయాళ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన నిర్ణయం సినిమా అల్ట్రా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమాతో నాగార్జున కి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలతో నాగార్జున పరభాష దర్శకులు సినిమాలు చేయాలంటే ఆచితూచి ముందుకు అడిగేస్తున్నాడు.

    ఇలా ఇతర భాషల్లో ఫ్లాప్ లను మూటగట్టుకున్న నాగార్జున తెలుగులో మాత్రం మంచి హిట్ లను సొంతం చేసుకున్నారు. కానీ ఇతర భాషల డైరెక్టర్లు మాత్రం నాగార్జునకు ఫ్లాప్ లనే ఇచ్చారు.