Tollywood: ఒక డైరెక్టర్ కు ఒకసారి స్టార్ డమ్ వచ్చాక, ముఖ్యంగా అతని పై ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి కలిగాక, అతని సినిమాలకు మార్కెట్ క్రియేట్ అయ్యాక, ఏది పడితే అది సినిమాగా తీయడానికి ఏ డైరెక్టర్ ఇష్టపడడు. పైగా ఒక్కో సినిమాకు సంవత్సరాల తరబడి తన సమయాన్ని కేటాయిస్తాడు. కానీ కొందరు దర్శకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు.

చేతిలో ఓ సినిమా పెట్టుకుని.. ఆ సినిమా షూట్ చేస్తూనే.. చిన్న గ్యాప్ వస్తే మరో సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తారు. అసలు రన్నింగ్ లో ఒక సినిమా ఉన్నప్పుడు, ఏ దర్శకుడు అయినా మరో సినిమా చేయడం అంటే.. అది అంత ఈజీ కాదు. డైరెక్టర్ అంటే.. ఆ సినిమాకు కర్త కర్మ క్రియ. అందుకే ఒకే కథ పై ఫుల్ ఫోకస్ పెట్టి పని చేయాలి.
అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాల్ని డీల్ చేసే దర్శకులు మనకు కనిపించరు. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి దర్శకుల హడావుడి ఎక్కువైపోయింది. వాళ్ళల్లో మెయిన్ గా ముచ్చటించుకోవాల్సిన పేర్లు క్రిష్, మారుతి. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హర హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. మధ్యలో కరోనా వచ్చి షూట్ కి కాస్త గ్యాప్ వచ్చింది.
దాంతో వెంటనే ‘కొండపొలం’ అంటూ ఒక సినిమా మొదలెట్టి ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ కూడా చేశాడు. అసలు చేతిలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా ఉన్పప్పుడు, చిన్న హీరోతో సినిమా చేసి.. ప్లాప్ అవ్వడం అవసరమా ? చిన్న సినిమా అయినా అది తేడా కొడితే, కచ్చితంగా ఆ ప్రభావం పెద్ద సినిమా పై పడుతుందని క్రిష్ ఎందుకు బావించలేదో ?
Also Read: Acharya Songs: Neelambari song lyrics Telugu and English, నీలాంబరి సాంగ్ లిరిక్స్
ఇక మరో డైరెక్టర్ మారుతి. గోపీచంద్ తో మారుతి ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా షూట్ కి గ్యాప్ వచ్చింది. వెంటనే ‘మంచి రోజులొచ్చాయి’ అంటూ కేవలం 30 రోజుల్లో ఈ సినిమా చేశాడు. సినిమా రిలీజ్ అయింది. బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అసలుకే మోసం వచ్చింది. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా మార్కెట్ పై ఈ ప్లాప్ టాక్ పడే అవకాశం ఉంది. అందుకే ఇక గ్యాప్ వచ్చిందని.. ఇంకొకటి చేయకండి అంటూ సినీ పెద్దల నుంచి వీళ్లకు సలహాలు వస్తున్నాయి.
Also Read: Puneeth Rajkumar: పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన… నటుడు రాజేంద్ర ప్రసాద్