Petrol Price: నిన్నా మొన్నటివరకు.. దేశంలో ఆయిల్ ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం అనేదే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జనానికి దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. ఈ ధరలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.

కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాయి. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు మరింతగా తగ్గాయి. కొన్నిచోట్ల డీజిల్ రేటు ఏకంగా రూ.17 వరకు తగ్గింది. ఒకేసారి భారీగా ధరలు తగ్గడంతో వాహనదారులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. సామాన్య ప్రజలకు సైతం కాస్త ఊరట లభించింది. అయితే.. ఇప్పుడు మరో తాజా వార్త వాహనదారులను ఊరిస్తోంది. అదేమంటే.. ఆయిల్ ధరలను మరింత భారీగా తగ్గించందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు చమాచారం. లీటర్ పెట్రోల్ ధరను(Petrol Price) రూ.60కి తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇందులో భాగంగా.. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీని కోసం ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచాలని చూస్తోందట. తద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి.. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్లాన్ తయారు చేసినట్లు టాక్. ఐతే ఫ్లెక్స్ ఫ్యూయెల్‌కు అనుగుణంగా కంపెనీలు కూడా ఇంజిన్లను తయారు చేయాల్సి ఉంటుంది.
నిజానికి.. ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను తయారు చేయడానికే తక్కువ ఖర్చవుతుంది. ఈ ఇంజిన్లలో ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఇంధనం కూడా ఉపయోగించొచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర రూ.60 దిగివచ్చే వకాశం ఉందని చెబుతున్నారు.
ఎప్పుడో సెంచరీ దాటిపోయిన పెట్రోల్ ధరను 60 రూపాయలకు తీసుకు రావడమనేది సాధారణ విషయం కాదు. అదే సమయంలో పెట్రోల్ లో ఇథనాల్ మోతాదు పెంచితే.. ఇంజన్లు దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. మరి, ఏం జరుగుతుంది? కేంద్రం ఎలా చేస్తుంది? అన్నది చూడాలి. ఎలా చేసినా.. లీటరు 60కి దిగితే.. ప్రజలకు అంతకన్నా కావాల్సిందేముంది?
Also Read: పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. దీపావళి పండుగ చేసుకోవలట!
పర్యావరణ క్షీణతకు పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తి పెరగడమే కారణమా..?